amp pages | Sakshi

మోదీ, రాహుల్‌ దక్షిణాదిలో పోటీ చేస్తారా?

Published on Tue, 03/26/2019 - 07:21

సాక్షి, న్యూఢిల్లీ : 2014, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అఖండ విజయం సాధించడంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టను ఉపయోగించుకొని దక్షిణాదిలో నామ మాత్రంగా ఉన్న పార్టీని బలోపేతం చేసుకోవాలని బీజేపీ భావించింది. ఎప్పటి నుంచో ఉత్తరాదిలో బలంగా ఉన్న ఈ పార్టీ లోక్‌సభ ఎన్నికల అనంతరం ఈశాన్య రాష్ట్రాలకు, కాస్త తూర్పు రాష్ట్రాలకు విస్తరించింది. ముఖ్యంగా ఏడు ఈశాన్య రాష్ట్రాల్లో ఆరు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. ఇక తూర్పు రాష్ట్రాలైన బీహార్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో అధికారంలోకి రాగా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో కాస్త బలపడింది. 

ఇక దక్షణాదిలో బలపడాలనే ఆకాంక్ష అలాగే ఉండిపోయింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైంది. తమిళనాడులో దూరేందుకు ప్రయత్నించినా పరిణామాలు అందుకు అనుకూలించలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఉన్న బలం కూడా ఇప్పుడు కనిపించడం లేదు. ఎప్పుడూ పునాదులు కూడా బలంగాలేని కేరళలో శబరిమల అయ్యప్ప ఆలయంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఆందోళన చేయడం ద్వారా హిందూ ఓటు బ్యాంకు లాక్కుని బలపడాలని చూసింది. కోయంబత్తూరు, పట్టణంతిట్ట లోక్‌సభ నియోజకవర్గాల్లో కొద్దిగా పట్టు సాధించింది. 

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ భూభాగంలోకి భారత వైమానిక దళం చొచ్చుకుపోయి బాలకోట్‌లో బాంబులు కురిపించిన సంఘటనతో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో పార్టీ బలపడుతుందని బీజేపీ భావించింది. ఈ సంఘటనతో హిందూ ఓటర్లను కొంత మేరకు బీజేపీ ఆకర్షించినా అది పార్టీ అభ్యర్థిని గెలుపించుకునే స్థాయిలో లేదు. పైగా బాలకోట్‌ దాడిలో 350 మంది ఇస్లాం ఉగ్రవాదులు మరణించారన్న ప్రచారాన్ని కూడా ఆ రెండు రాష్ట్రాల ప్రజలు విశ్వసించడం లేదు. ముస్లింలు ఎక్కువగా ఉన్న తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కూడా మునుపుటి బలం బీజేపీకి లేకుండా పోయింది. ‘పాకిస్థాన్‌తో యుద్ధం కోసం అనసరంగా డబ్బులను ఎందుకు వృధా చేస్తారు ? ఆ డబ్బును పిల్లల చదువుకోసం ఖర్చు పెట్టండి’ అంటూ ఆంధ్రా ప్రజలు వ్యాఖ్యానించడం గమనార్హం. 

సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి స్థానంతోపాటు కర్ణాటకలోకి బెంగళూరు నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. 1989 నుంచి ఆ సీటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ నాయకుడు అనంత కుమార్‌ 2018లో మరణించారు. ఆయన భార్య తేజస్వని అనంత కుమార్‌ను అక్కడి నుంచి దించాలని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుండగా హఠాత్తుగా మోదీ పేరు బయటకు వచ్చింది. ఇదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కేరళ నుంచి కూడా పోటీ చేస్తారన్న ప్రచారం మొదలైంది. రాహుల్‌ గాంధీ ప్రాతినిథ్యం విహిస్తున్న అమేథి నుంచి బీజేపీ నుంచి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు. ఆమెతో ఓటమి భయం ఉండడంతోనే రాహుల్‌ కేరళ నుంచి బరిలోకి దిగాలనుకుంటున్నారంటూ బీజేపీ నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. కేరళ నుంచి రాహుల్‌ గాంధీ పోటీ చేసినట్లయితే సీపీఎం అభ్యర్థిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇద్దరు జాతీయ ప్రత్యర్థినాయకులు దక్షిణాది నుంచి పోటీ చేస్తారా, లేదా అన్నదానిలో బెంగళూరు స్థానం గురించి మార్చి 26వ తేదీన తేలిపోతుంది. కేరళ స్థానం గురించి తేలాలంటే ఏప్రిల్‌ నాలుగవ తేదీ వరకు నిరీక్షించాల్సి రావచ్చు. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)