amp pages | Sakshi

సీఎంగా ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం

Published on Mon, 12/25/2017 - 18:23

సాక్షి, గాంధీనగర్‌: గుజరాత్‌ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత విజయ్ రూపానీ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు అత్యంత విధేయుడైన విజయ్‌ రూపానీ రెండోసారీ గుజరాత్‌ సీఎంగా, డిప్యూటీ సీఎంగా నితిన్ భాయ్ పటేల్ రేపు (డిసెంబర్ 26న) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఈ భారీ ఈవెంట్‌కు హాజరు అవుతున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. గత శుక్రవారం గుజరాత్‌ బీజేపీ శాసనసభా పక్షం రూపానీని తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసన సభ్యుల భేటీలో శాసనసభా పక్ష నేతగా రూపానీని, ఉప నేతగా నితిన్‌ పటేల్‌ను ఎన్నుకున్నారు.

ఇటీవల జరిగిన  గుజరాత్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చినా వరుసగా ఆరోసారి బీజేపీ అధికారం కైవసం చేసుకుంది. 182 మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీ 99 సీట్లతో 1995 అనంతరం తొలిసారి అతి తక్కువ స్థానాలు సాధించింది. మూడంకెల సీట్లు సాధించలేకపోయామని భావిస్తోన్న బీజేపీకి.. ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే రతన్‌సిన్హ్‌ రాథోడ్‌ మద్దతు పలకడంతో సెంచరీ మార్కు దాటినట్లైంది. కాగా, మూడు దశాబ్దాల అనంతరం మొదటిసారి కాంగ్రెస్‌ 77 స్థానాల్ని సొంతం చేసుకుంది. మిత్రపక్షాలతో కలిసి కాంగ్రెస్‌ 80 స్థానాల్లో విజయం సాధించి అధికార బీజేపీకి గట్టి పోటీ ఇచ్చింది.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)