amp pages | Sakshi

మీ గెలుపు పెద్దిరెడ్డి భిక్షకాదా?

Published on Sat, 07/21/2018 - 09:05

పలమనేరు: గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పలమనేరు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా విజయం సాధించడం వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండదండలు లేవా ? ఆయన భిక్షతో గెలిచి నేడు అధికారంలో ఉన్నామని ఏది పడితే అది మాట్లాడడం మంత్రి అమరనాథరెడ్డికి తగదని వైఎస్సార్‌సీపీ పలమనేరు నియోజకవర్గ సమన్వయకర్త వెంకటేగౌడ  విమర్శించారు. పలమనేరులోని ఆయన నివాసంలో పార్టీ నేతలతో కలసి శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘నాడు మీరు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వస్తే మన పార్టీని నమ్ముకుని వచ్చారు.. పలమమేరులో మిమ్మల్ని గెలిపిం చాలని పెద్దిరెడ్డి పార్టీ శ్రేణులను ఆదేశించిన విషయం అప్పుడే మరిచిపోతే ఎలా ?’ అంటూ ప్రశ్నించారు. ‘మీరు వైఎస్సార్‌సీపీ ఓట్లతో గెలిచి  మంత్రి పదవి కోసం పార్టీ ఫిరాయించిన విషయ మై ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. దాన్ని మరిచి పెద్దిరెడ్డిని విమర్శించడం మంచిది కాదు. దీన్నీ ప్రజలు గమనిస్తున్నార’ని తెలిపారు.

సీనియర్‌ నాయకుడు సీవీ కుమార్‌ మాట్లాడుతూ పెద్దిరెడ్డిని విమర్శించే స్థాయి అమరనాథరెడ్డికి లేదని చెప్పారు. మంత్రి అనే ధైర్యంతో ఎక్కడైనా పోటీచేయండిగానీ అధికారం ఉందని విలువలు లేని రాజకీయాలు చేయడం మంచిదికాదన్నారు. పట్టణ కన్వీనర్‌ సుధాకర్‌ మాట్లాడుతూ అమరనాథరెడ్డి ఒక విమర్శచేస్తే తాము వంద చేస్తామని, గతాన్ని మరిచి మాట్లాడడం బాధాకరమని చెప్పారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి మురళీకృష్ణ మాట్లాడుతూ  జగన్‌మోహన్‌రెడ్డి బీఫామ్‌ ఇస్తే ఫ్యాను గుర్తుపై గెలిచి నేడు తమరు మంత్రి అయ్యారని, ఓడివుంటే  ఆ పదవి దక్కేదా ? అని ప్రశ్నించారు. ఎస్సీ విభాగం జిల్లా కార్యదర్శి శ్యామ్‌సుందర్‌రాజు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ప్రహ్లాద మాట్లాడుతూ గెలిపించినవారినే విమర్శించడం తగదన్నారు. కౌన్సిలర్లు కమాల్, మూర్తి, మున్నా, గోవిందప్ప, షబ్బీర్, నాయకులు నయాజ్, నాగరాజు, రాజారెడ్డి, శశిధర్, జావీద్, సోమశేఖర్‌ రెడ్డి,అక్బర్, ముజ్జు, సేటు తదితరులు పాల్గొన్నారు.

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌