amp pages | Sakshi

‘కాంగ్రెసోళ్లంత నెత్తిమీద దస్తీ వేసుకొని పోవాల్సిందే’

Published on Thu, 12/20/2018 - 15:32

సాక్షి, జనగామ : కాంగ్రెస్‌ నాయకులు ఎంత తిరిగిన తెలంగాణ ప్రజలు వారిని నమ్మే పరిస్థితి లేదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు.ఇక తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు నెత్తి మీద దస్తీ వేసుకోని పోవడమే తప్పా చేసేదేమి లేదని ఎద్దేవా చేశారు. గురువారం జనగామలో ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆశీర్వాద సభలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశారని కొనియాడారు. టీఆర్‌ఎస్‌ పుట్టుక ఓ చరిత్ర అని, 14 ఏళ్లు పోరాడి కేసీఆర్‌ తెలంగాణ తీసుకొచ్చారని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తల కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి వరంగలే కీలకపాత్ర పోషించిందని గుర్తుచేశారు.

జనగామ నుంచి ముగ్గురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లా నుంచి ఒకరికైనా మంత్రి పదవి వచ్చేలా చూస్తామన్నారు. దేవాదుల ద్వారా త్వరలోనే జనగామలోని చెరువులన్నింటిని నింపి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యకర్తలే టీఆర్‌ఎస్‌కు బలం అని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్‌, బీజేపీని కాదని దేశం మొత్తం టీఆర్‌ఎస్‌ వైపు చూస్తుందన్నారు. కేసీఆర్‌ నాయకత్వం దేశానికే దిక్సూచిగా మారనుందని వివరించారు. పంచాయతీ, సొసైటీ, మున్సిపల్, ఎంపీల ఎన్నికల్లో బూత్ స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేస్తే అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్‌  గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 16ఎంపీ స్థానాలు గెలిచి ఢిల్లీని శాసిద్దామని కార్యకర్తలు వివరించారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)