amp pages | Sakshi

జేబులు నింపుకోవడానికే ప్రాజెక్టులు

Published on Thu, 05/28/2020 - 03:24

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తారని కేసీఆర్‌ను సీఎంగా ఎన్నుకుంటే అందుకు భిన్నంగా ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. జేబులు నింపుకోవడానికే మిషన్‌ భగీరథ, కొత్త ప్రాజెక్టులు కడుతున్నారని ఆరోపించారు. ఇంత అవినీతి సీఎం దేశంలో ఎవరూ లేరని ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై బుధవారం పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

ఉత్తమ్‌ మాట్లాడుతూ.. పోతి రెడ్డిపాడు ద్వారా రోజూ 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కుల నీళ్లు ఏపీ తీసుకువెళితే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీళ్లు తీసుకెళుతామని గత డిసెంబర్‌లో ఏపీ ప్రభుత్వం ప్రకటించిందని, ఈ విషయంపై జనవరి 5న తమ పార్టీ నేత నాగం జనార్దన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తే స్పందించలేదన్నారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క నూతన ఆయకట్టు కన్నా నీరిచ్చారా అని ప్రశ్నించారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కడితే 16 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చేదని, కానీ సీఎం పట్టించుకోలేదని విమర్శించారు.

మహబూబ్‌నగర్‌ను బొందపెట్టిండు...
కాంగ్రెస్‌ హయాంలో ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులను 90% పూర్తిచేస్తే, ఈ ఆరేళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 10% పనులను కూడా పూర్తి చేయలేదని ఉత్తమ్‌ దుయ్యబట్టారు. ఎంపీగా రాజకీయ జీవితాన్ని ఇచ్చిన మహబూబ్‌నగర్‌ను కేసీఆర్‌ బొందపెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ హయాంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ 30 కిలోమీటర్లు పూర్తి చేస్తే, మిగిలిన 10 కిలోమీటర్ల పనులను టీఆర్‌ఎస్‌ పూర్తి చేయలేకపోయిందన్నారు. వచ్చే నెల 2న కృష్ణానది పరివాహక ప్రాజెక్టుల వద్ద జల దీక్ష చేస్తున్నట్లు ఉత్తమ్‌ ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు మేరకు చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం, వలస కార్మికులను వారి సొంతూళ్లకు తరలించడం తదితర కార్యక్రమాలపై పార్టీ నేతలు, కార్యకర్తలు నేడు సోషల్‌ మీడియా క్యాంపెన్‌ నిర్వహించాలని సూచించారు.

సాగర్‌ ఎండిపోయే ప్రమాదం.. 
ఉన్న నీళ్లనే వాడుకలోకి తీసుకురాలేని ప్రభుత్వం అదనపు నీళ్లను ఎలా తీసుకువస్తుందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అదనంగా నీళ్లను తీసుకెళ్లాలనే ఆలోచన వచ్చేది కాదన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండితేనే నాగార్జునసాగర్‌కు నీళ్లు వస్తాయని, సాగర్‌ నిండక ఏడేళ్లు అవుతుందని, ఈ పరిస్థితుల్లో సంగమేశ్వర నుంచి నీళ్లను తీసుకువెళితే భవిష్యత్‌లో నాగార్జునసాగర్‌ ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. దీంతో సాగర్‌ ఎడమ కాల్వ మీద ఆధారపడిన ఖమ్మం, నల్లగొండ జిల్లాలు ఎడారిగా మారతాయన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డిలు సాగునీటి రంగంలో జిల్లాకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. సమావేశంలో మాజీ ఎంపీ మల్లురవి, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. చిత్రంలో కాంగ్రెస్‌ నేతలు సంపత్‌ తదితరులు

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)