amp pages | Sakshi

టీడీపీ కక్షసాధింపు

Published on Tue, 05/01/2018 - 11:38

నంద్యాల: టీడీపీ నాయకుల అధికార దుర్వినియోగానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. 2014 అక్టోబర్‌ నెలలో మున్సిపల్‌ కార్యాలయంలో జరిగిన ఘర్షణ కేసులో సాక్ష్యం చెప్పారని వైఎస్సార్సీపీ కౌన్సిలర్‌పై ఏకంగా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆస్తి విషయంలో తల్లీకొడుకుల మధ్య ఘర్షణ జరగగా..సంఘటన స్థలంలో కౌన్సిలర్‌ లేకున్నా అతనిపై కేసు నమోదు చేయించారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్‌పై అన్యాయంగా పెట్టిన కేసును ఎత్తివేయాలని వైఎస్సార్సీపీ నాయకులు శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, దేశం సుధాకర్‌రెడ్డి, పీపీ మధుసూదన్‌రెడ్డి, న్యాయవాది తులసిరెడ్డి, కౌన్సిలర్లు, వైఎస్సార్సీపీ నాయకులు నంద్యాల డీఎస్పీ గోపాలకృష్ణను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల ఇలా ఉన్నాయి..

ఈ నెల 28న శనివారం రాత్రి వెంకటరమణ, పెద్దన్న వారి తల్లి ఏసక్కల మధ్య ఆస్తి వివాదానికి సంబంధించిన ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్‌ అనిల్‌ అమృతరాజు సంఘటనా స్థలంలో లేకున్నా టీడీపీ నాయకులు పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు నమోదు చేయించారని వైఎస్సార్సీపీ నాయకులు శిల్పారవి పేర్కొన్నారు. మున్సిపల్‌ కార్యాలయంలో జరిగిన ఘర్షణలో టీడీపీ నాయకుల బెదిరింపులకు భయపడకుండా సాక్ష్యం చెప్పినందుకే హత్యాయత్నం కేసు నమోదు చేశారని కౌన్సిలర్‌ అమృతరాజు పేర్కొన్నారు. సంఘటన జరిగిన సమయంలో శనివారం రాత్రి 7 నుంచి 11గంటల వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన సభలో ఉన్నానని తెలిపారు. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆస్తి వివాద ఘర్షణను తనపై వేసి భయపెట్టాలని చూస్తున్నారని, ఒకరిని భయపెడితే మిగతా వారు సాక్ష్యాలు చెప్పరనే ఉద్దేశంతోనే టీడీపీ నాయకులు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అనిల్‌ అమృతరాజ్‌పై పెట్టిన కేసును పక్షపాతం లేకుండా దర్యాప్తు చేసి కేసును కొట్టివేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ నాయకులు నంద్యాల డీఎస్పీ గోపాలకృష్ణను సోమవారం కలిసి  వినతి పత్రం అందజేశారు. పూర్తిస్థాయిలో విచారించి అన్యాయంగా కేసు పెట్టింటే ఎత్తివేస్తామని డీఎస్పీ వైఎస్సార్సీపీ నాయకులకు హామీ ఇచ్చారు.

అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకోం
వైఎస్సార్సీపీ నాయకులపై తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని, వీటిని వెంటనే మానుకోవాలని శిల్పారవి హెచ్చరించారు.  పోలీసులపై తమకు నమ్మకం ఉందని, కేసును పూర్తి స్థాయిలో విచారించి సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానన్నారు. ఘర్షణ జరిగిన ప్రదేశంలో లేని కౌన్సిలర్‌పై  టీడీపీ నాయకులు.. పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు పెట్టించినట్లు తమకు సమాచారం ఉందని, ఇలాంటి పరిణామాలు మంచివి కాదన్నారు. పోలీసులు విచారించి న్యాయం చేయాలని కోరారు.

శిల్పా రవి కౌన్సిలర్‌ అమృతరాజుకు సంబంధం లేదు
తన కుమారులు అన్నం పెట్టకుండా రోడ్డున పడేస్తే అనాథాశ్రమంలో బతుకుతున్నానని చెన్నమ్మ చెప్పారు.  ఆస్తి ఇప్పించాలని కోరుతూ ఆర్‌డీఓను ఆశ్రయించానన్నారు. ఆస్తిని సమానస్థాయిలో పంచాలని ఆర్డీఓ చెప్పడంతో మా కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ జరుగుతుందన్నారు. ఈ సంఘటనకు కౌన్సిలర్‌ అనిల్‌అమృతరాజ్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కేవలం అమృతరాజును కేసులో ఇరికించాలని ఈ పని చేశారన్నారు. టీడీపీకి చెందిన నాయకులు వెంకటరమణను ఆసుపత్రికి తీసుకొని వెళ్లి అమృతరాజ్‌పై కేసు పెట్టించారన్నారన్నారు.

Videos

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)