amp pages | Sakshi

మాకొద్దీ చౌకీదార్‌ పని..

Published on Fri, 03/22/2019 - 10:47

ఇది ఎన్నికల కాలం.. నోటి మాటలు కొన్ని తూటాల్లాపేలిపోతాయి. ఇంకొన్ని తుస్సుమంటూ నవ్వుల పాలవుతుంటాయి. మరికొన్ని ఏళ్లు గడచినా అలా మన నోళ్లలో నానుతూనే ఉంటాయి. ‘రోటీ కపడా మకాన్‌‘ చివరి కోవకు చెందితే.. ఇండియా షైనింగ్‌ రెండో వర్గానిది!! మరి మోదీ తాజా నినాదం.. మై భీ చౌకీదార్‌..?కొన్ని రోజుల క్రితం ప్రధాని మోదీ ఓ బహిరంగసభలో ప్రసంగిస్తూ.. అవినీతి అక్రమాలు జరక్కుండా తాను కాపలాదారుగా ఉంటానని.. ప్రజలు ఒక్కొక్కరూ జాగరూకతతో చౌకీదార్లుగా మారాలని సూచించారు. ఈ మాట కాస్తా వైరల్‌ అయిపోయింది.

ఒకవైపు ట్విట్టర్‌.. ఈ అంశంపై వాద ప్రతివాదాలతో హోరెత్తిపోగా.. సోషల్‌ మీడియాలోనూ చర్చోపచర్చలు జరిగాయి. మంత్రివర్గ సభ్యులు, బీజేపీ నేతలు చాలామంది తమ ట్విట్టర్‌ హ్యాండిళ్లకు ముందు ‘చౌకీదార్‌’ పదాన్ని జోడించుకుని మరీ మోదీకి మద్దతు పలికారు. ఇదే సమయంలో ప్రత్యర్థులు, ప్రతిపక్ష పార్టీ నేతలు ఈ పదం వాడుకపై తమదైన రీతిలో చెణుకులు, విమర్శలు ఎక్కుపెట్టారు.
ఆర్థికశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత పి.చిదంబరం ఒక ట్వీట్‌ చేస్తూ.. నేను అపాయింట్‌ చేసిన చౌకీదార్‌ కనిపించడం లేదని.. మంచిరోజులు (అచ్ఛే దిన్‌) వెతుక్కుంటూ వెళ్లినట్లు ఎవరో చెప్పారని వ్యంగ్యోక్తి విసరగా, కొంతమంది దేశానికి మంచి రోజులు తేకుంటే పేరు మార్చుకుంటానన్న మోదీ మాటలను మళ్లీ చర్చల్లోకి తెచ్చారు.

‘పేరు మార్చుకుంటానంటే ఇలా అని అనుకోలేదు’ అంటూ టి.వివేక్‌ అనే వ్యక్తి  ఓ మీమ్‌ను వదిలాడు.
టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కార్టూనిస్ట్‌ ఇంకో అడుగు ముందుకేసి మోడీని సెక్యూరిటీ గార్డుగా చిత్రీకరించి.. ఎప్పుడో మరణించిన మాజీ ప్రధాని నెహ్రూ ఉద్యోగాలు, గ్రామీణాభివృద్ధి, భద్రతామండలిలో సభ్యత్వం వంటివన్నీ ఎత్తుకెళుతున్నట్లు చిత్రీకరించారు. దేశంలోని అన్ని  సమస్యలకూ నెహ్రూ కారణమని వాదించే బీజేపీ మద్దతుదారులపై విమర్శ అన్నమాట!
అయితే, చౌకీదార్‌ అనే పదం అందరిలోనూ విమర్శలు మాత్రమే లేవనెత్తలేదు. దాదాపు ఏడాదిన్నర క్రితం జవహర్‌లాల్‌ యూనివర్శిటీలో ఏబీవీపీ సభ్యులతో గొడవ తరువాత కనిపించకుండా పోయిన నజీబ్‌ అహ్మద్‌ గురించి కూడా అతడి తల్లి ఒక ట్వీట్‌లో లేవనెత్తారు. ఫాతిమా నఫీస్‌ హ్యాండిల్‌తో ట్వీట్‌ చేసిన ఆమె.. ‘నువ్వు కాపలాదారువైతే నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పు?’ అని ప్రశ్నించింది. అంతేకాదు.. ఏబీవీపీ గూండాలను ఇప్పటివరకూ ఎందుకు అరెస్ట్‌ చేయలేదని, సీబీఐ, ఎన్‌ఐఏ వంటి సంస్థలు కూడా తన కొడుకు ఆచూకీ ఎందుకు కనిపెట్టలేకపోయాయి? అని ప్రశ్నించింది ఆమె.

మాకొద్దీ చౌకీదార్‌ పని..
మోదీ చౌకీదారు వ్యాఖ్యలపై ట్విట్టర్‌ అకౌంట్ల విమర్శల మాటెలా ఉన్నా.. దేశంలోని అసలైన కాపలాదార్లయిన మన సెక్యూరిటీ గార్డులు ఈ అంశంపై ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌ పోర్టల్‌ స్క్రోల్‌ ఒక ప్రయత్నం చేసింది. కొంతమంది గార్డులు మోదీ వ్యాఖ్య వల్ల తమకు ఒరిగేదేమీ ఉండదని, బొటాబొటీ జీతాలతో బతుకు వెళ్లదీయక తప్పదని నిష్టూరమాడారు. పదిహేనేళ్లపాటు గార్డుగా పనిచేసి పెన్షన్‌ కోసం తంటాలు పడుతున్న అరవై ఏళ్ల గుణశేఖర్‌ (బెంగళూరు) ‘ఆయన ప్రధానమంత్రి.. ఏమైనా మాట్లాడగలడు. మావేమో పేద బతుకులు. మా పని మేం చేసుకుంటున్నాం’ అని వ్యాఖ్యానించారు. రోజుకు పన్నెండు గంటల పాటు డ్యూటీలో ఉండటం వల్ల పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశమూ లేకుండా పోతోందని వాపోయాడు. మోదీ వచ్చాక తాము నగదు దొరక్క చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పారు. ఇక, ముంబైలో రోజుకు రెండు షిఫ్ట్‌లు గార్డ్‌గా పనిచేస్తూ నెలకు రూ.15 వేలు సంపాదిస్తున్న సాగర్‌ తివారీ మాత్రం.. ‘టాయిలెట్లు కట్టడం దగ్గరి నుంచి మోదీ ఎన్నో మంచి పనులు చేశాడు. మై భీ చౌకీదార్‌ అనడం ద్వారా ప్రధాని మా పనిని గుర్తించి’నట్లు భావిస్తున్నామని చెప్పారు. మోడీ తనను తాను కాపలాదారునని చెప్పుకోవడం తనకు నవ్వు తెప్పిస్తోందన్నది చెన్నైలోని ఎస్‌.కుప్పన్‌ అభిప్రాయమైతే.. సమాజంలోని వర్గ భేదాలను తగ్గించేందుకు ఆయన వ్యాఖ్య ఉపయోగపడుతుందన్నది లక్నోకు చెందిన అఖిలేష్‌ సింగ్‌ అంచనా.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)