amp pages | Sakshi

ఢిల్లీ వేదికగా కేసీఆర్‌కు రేవంత్‌ సవాల్‌!

Published on Tue, 10/31/2017 - 16:13

 సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రజల జీవితాలు బాగుండాలని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆశించారని, అందుకే ఎలాంటి ప్రయోజనాలు చూడకుండా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన అనంతరం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రపదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా లెక్క చేయకుండా సోనియా తెలంగాణను ఇచ్చారని అన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్‌ ఎవర్నీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

గత 40 నెలల్లో 3,400మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  తెలంగాణ వచ్చాక కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారని, ఆయన కొడుకు మంత్రి అయ్యారని, కుటుంబంలోని నలుగురికి పదవులు వచ్చాయని విమర్శించారు. పత్రిక, చానెల్‌ పెట్టి రాష్ట్రాన్ని కేసీఆర్‌ దోచుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణను వ్యతిరేకించిన వారితోనే కేసీఆర్‌ దోస్తీ చేస్తూ.. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచిపెడుతున్నారని దుయ్యబట్టారు. రాహుల్‌ నాయకత్వంలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడుతామని రేవంత్‌రెడ్డి అన్నారు. మరోవైపు రేవంత్‌రెడ్డితోపాటు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో హస్తం శ్రేణుల్లో ఉత్సాహం ఉరలెత్తుతోంది. ఇదే ఊపుతో ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నేతలు భావిస్తున్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)