amp pages | Sakshi

హైడ్రామా మధ్య రేవంత్‌ అరెస్ట్, విడుదల

Published on Wed, 12/05/2018 - 02:33

కొడంగల్‌/జడ్చర్ల: టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డిని సోమవారం హైడ్రామా మధ్య పోలీ సులు అరెస్టు చేశారు. కొడంగల్‌ బంద్‌కు పిలుపునివ్వడంతోపాటు మంగళవారం కోస్గిలో సీఎం కేసీఆర్‌ సభను అడ్డుకుంటానంటూ ఆయన ప్రకటించడంతో ఎన్నికల కమిషన్‌ ఆదేశాల ప్రకారం బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్‌ జిల్లా పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సోమవారం అర్ధరాత్రి దాటాక 3 గంటల సమయంలో పోలీసులు రేవంత్‌ ఇంటివద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. గేటు తాళాన్ని పగలగొట్టి లోనికి ప్రవేశించిన పోలీసులు, బెడ్రూంలో నిద్రిస్తున్న రేవంత్‌ను బయటకు రావాల్సిందిగా పిలిచారు. ఆయన బయటకు వచ్చేందుకు నిరాకరించడంతో తలుపును బలవంతంగా నెట్టివేశారు. దీంతో బెడ్రూం గొళ్లెం విరిగిపోయింది. అనంతరం రేవంత్‌ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా ఆయన అందుకు సహకరించలేదు.

వారెంట్‌ చూపకుండా అరెస్టు్ట చేయాలనుకోవడం ఏమిటని ప్రశ్నిస్తూ పోలీసులను బయటకు వెళ్లాలని గదమాయించారు. ఈసీ ఆదేశాలను అమలు చేయాలంటూ రేవంత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. జడ్చర్ల శివారులోని జిల్లా పోలీస్‌ శిక్షణా కేంద్రానికి  తరలించారు. తన భర్తను అరెస్టు చేయడంపై రేవంత్‌ సతీమణి గీతారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మేము ఏమైనా టెర్రరిస్టులమా? అని ప్రశ్నించారు. తీవ్రవాదులను తీసుకెళ్లినట్లు తన భర్తను లాక్కెళ్లడం దారుణమన్నారు. కేసీఆర్‌ తమ కుటుంబంపై కక్షగట్టారని ఆరోపించారు. కొడంగల్, మద్దూరు, కోస్గి, దౌల్తాబాద్, బొంరాస్‌పేట మండలాల్లోని కాంగ్రెస్‌ ముఖ్య నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం కొడంగల్‌ నియోజకవర్గం కోస్గిలో కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభ ముగిశాక 6 గంటల ప్రాంతంలో రేవంత్‌ను తిరిగి ఆయన నివాసంలో వదిలిపెట్టి వెళ్లారు. కాగా, రేవంత్‌ అరెస్టు నేపథ్యంలో కొడంగల్‌ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలు కేసీఆర్‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు. 

అక్రమ అరెస్టులతో సీఎం సభ: రేవంత్‌ 
అక్రమ అరెస్టులు నిర్వహిస్తూ పోలీసుల పహారాలో కేసీఆర్‌ కోస్గిలో సభ నిర్వహించుకున్నారని రేవంత్‌ ఎద్దేవా చేశారు. మంగళవారం సాయంత్రం పోలీసులు రేవంత్‌ను విడిచిపెట్టిన అనంతరం తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కోస్గి సభలో తన పేరు ప్రస్తావించడానికి భయపడిన కేసీఆర్‌.. ఇంక తననేం ఓడిస్తారని ప్రశ్నించారు. డీజీపీ, ఇంటెలిజెన్స్‌ ప్రభాకర్‌లను కేసీఆర్‌ తొత్తులుగా మార్చుకొని నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. ఓటుకు రూ. 5 వేల చొప్పున కొడంగల్‌ ప్రజలను ప్రలోభాలకు గురిచేసేందుకు రూ. 100 కోట్ల నుంచి రూ. 150 కోట్లతో కేసీఆర్‌ ప్రజలపై యుద్ధం ప్రకటించారన్నారు. ‘‘ఎన్నికలకు ఇంకా 48 గంటల సమయం ఉంది. ముగ్గురూ రండి కొడంగల్‌ చౌరస్తాలో తేల్చుకుందాం’’ అని సవాల్‌ విసిరారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)