amp pages | Sakshi

రాజశేఖర్‌ రెడ్డి సేవలు మరువలేనివి: పొన్నాల

Published on Mon, 05/14/2018 - 17:58

సాక్షి, జనగామ: వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి నేటికి 14 సంవత్సరాలు పూర్తైందని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గుర్తు చేశారు. సోమవారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజే ఉమ్మడి రాష్ట్రాన్ని ఆదుకోవడం కోసం ఉచిత విద్యుత్‌ ఫైలుపై సంతకం చేశారని తెలిపారు. రైతు సంక్షేమమే ప్రజల సంక్షేమం అని భావించి వ్యవసాయానికి లాభం చేకూర్చేలా పథకాలు ప్రవేశపెట్టారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేసిన సేవలు మరవలేనివన్నారు. 

అత్యంత పొడవైన సొరంగ మార్గం గల శ్రీశైలం పాజెక్టును 30 సంవత్సరాలలో పూర్తి చేయనిది కాంగ్రెస్‌ ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే పూర్తి చేసిందన్నారు. సింగరేణికి 22 కిలోమీటర్ల భూసేకరణ చేసి విద్యుత్‌ ఉత్పాదనకు ఆటంకం రాకుండా చేశామని తెలిపారు. అయినా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది పథకాల మీద కానీ ప్రచారం మీద కాదన్నారు.

రైతులకు  లక్ష రుపాయల రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ హామీయిచ్చి మాట తప్పిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు విడతల్లో చేస్తామని చెప్పి, రైతులు అప్పుల ఊబిలోకి వెళ్లిపోయినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 24 గంటల కరెంట్‌ వల్ల భూగర్భ జలాలు అడుగంటి రైతులు పంట నష్టపోయారని, ఇంతవరకు నష్టపోయిన పంటలను మీ అధికారులైనా.. రైతు సమితి సభ్యులైనా సందర్శించారా అని ప్రశ్నించారు. వెంటనే పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. 
 
పండిన పంటకు మద్దతు ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఆశ్చర్యకరమైన విషయం అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రతి పంటకు మద్దతు ధరపైన బోనస్‌ ఇచ్చామని గుర్తు చేశారు. కౌలు రైతులు, దేవాదాయ భూములు చేసే రైతులు మీ కళ్లకు కనిపించడం లేదా? వారికి కూడా రైతు బంధు పథకాన్ని అమలు చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Videos

నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్‌

ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించింది

పెరిగిన ఓటు శాతం కేటగిరీల వారీగా..!

ఏపీలో ఎందుకిలా ?..రాష్ట్రం రావణకాష్టంగా మారటానికి అసలు కారణం

పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..

సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో

ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు

రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు

కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి

ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిచిన ఈసీఐ

Photos

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)