amp pages | Sakshi

విష ప్రచారం నమ్మొద్దు

Published on Wed, 11/08/2017 - 03:35

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్‌ జిల్లా సాగు, తాగునీటి అవసరాలకు సరిపడా నీటిని నిల్వ చేస్తూనే.. ఇతర ప్రాంతాలకు సింగూరు జలాలను విడుదల చేస్తున్నట్లు భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని తరలించుకుపోతున్నారనే కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంల విష ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదలపై విపక్షాల విమర్శల నేపథ్యంలో హరీశ్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

సింగూరు, ఘణపురం ఆయకట్టు రైతాంగం సాగు నీటి అవసరాలతో పాటు, జంట నగరాల తాగునీటి అవసరాల కోసం సింగూరు ప్రాజెక్టులో 16 టీఎంసీల నీరునిల్వ ఉంటుందని పేర్కొన్నారు. యాసంగిలో ఘణపురం ఆయకట్టు కోసం 4, సింగూరు ఆయకట్టుకు 2 టీఎంసీలతోపాటు తాగునీటి అవసరాలకు 2.50 టీఎంసీలు కేటా యించామని తెలిపారు. దీంతోపాటు ప్రాజెక్టులో మరో 7.50 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని మంత్రి పేర్కొ న్నారు. ప్రాజెక్టు చరిత్రలో తొలిసారిగా ఒకే ఏడాదిలో రెండు పంటలకు సాగునీరందిం చిన ఘనత తమకే దక్కుతుందని చెప్పారు.  టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతే సింగూరు కాలువలు, లిఫ్ట్‌ పనులు శరవేగంగా పూర్తి చేసి.. వరుసగా మూడో పంటకు 40 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు.

విపక్షాలకు విమర్శించే హక్కు లేదు..
పదేళ్ల పాలనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదని మంత్రి గుర్తు చేశారు. గతంలో సింగూరు నుంచి నీటి విడుదల కోసం ఘణపురం ఆయకట్టు రైతులు హైదరాబాద్‌లో  ఆందోళనలు చేసిన విషయా న్ని గుర్తు చేశారు. సింగూరు జలాలను ఉమ్మడి మెదక్‌ జిల్లాకే పరిమితం చేయాలని, లేదంటే పైపులైన్లు బద్దలు కొడతామంటూ ప్రకటించిన బీజేపీ ఆ తర్వాత ఎందుకు ఉద్యమించలేదని ప్రశ్నిం చారు. సింగూరుపై విపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని, ప్రజలు ఆందోళనకు గురికా వద్దని హరీశ్‌ కోరారు. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఏనాడూ రైతుల ప్రయోజనాలు పట్టించుకోలేదని విమర్శించారు.

Videos

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)