అంతా నా ఇష్టం!

Published on Thu, 03/14/2019 - 11:32

ఈ ఎన్నికల తరుణంలో ఓటరు మనోగతం ఏమిటి? ఎవరికి ఓటెయ్యాలో ఎప్పుడు నిర్ణయించుకుంటాడు? ఓటరుపై పనిచేసే అంశాలేమిటి? పొత్తులతో చిత్తు చేయవచ్చా? ‘పుల్వామా’ ప్రభావం చూపుతుందా? పథకాలకు ఓట్లు కుమ్మరించే సత్తా ఉందా? కుర్రకారు ఆలోచన తీరెలా ఉంది? ఇవన్నీ ఇప్పుడు ఎన్నికల ముందు తలెత్తుతోన్న సవాలక్ష సందేహాలు. ఓటరునాడిని పట్టుకునేందుకు రాజకీయ పార్టీలూ, నేతలూ తలలు పట్టుకుంటున్నారు. పరిశీలకులూ, పరిశోధకులూ రంగంలోకి దిగి జల్లెడపడతారు. వచ్చే ఎన్నికల్లో ఓటరు ఆలోచనా తీరు ఎలా ఉండబోతోందో వివిధ సందర్భాల్లో వివిధ ఎన్నికల గణాంకాల నిపుణులు వెల్లడించిన అనేక అంశాలను క్రోడీకరిస్తే ఆసక్తికర అభిప్రాయాలు వెల్లడయ్యాయి. 

ముందే నిర్ణయం..
2004 సార్వత్రిక ఎన్నికల వరకూ ప్రజలు ఓటు వేయడానికి కేవలం మూడు నాలుగు రోజుల ముందే ఓ నిర్ణయానికి వచ్చేవారని, అయితే ఇప్పుడా పరిస్థితి మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు ప్రజలు ఓటింగ్‌కి మూడు నాలుగు రోజుల ముందు మాత్రమే స్థిరమైన నిర్ణయానికి వచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఫలానా పార్టీకి వ్యతిరేకంగా ఓటెయ్యాలనో, లేదంటే ఫలానా పార్టీని గెలిపించాలనో ఎన్నికలకు చాలా ముందుగానే నిశ్చితాభిప్రాయానికి వస్తున్నారు. 2009–2014 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికలకు చాలా ముందుగానే ప్రజలు స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు.

మనోళ్లు ఓడిపోయే వాళ్లకి ఓటెయ్యరు..
ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ వస్తుందన్న ఆశలేని సందర్భాల్లో ఎటు వీలైతే అటు మొగ్గుచూపే ఫ్లోటింగ్‌ ఓటర్లు 20 శాతమే అయినా పార్టీల గెలుపోటములను ప్రభావితం చేయడానికి ఆ సంఖ్య చాలు. ఎన్నికల్లో ప్రతి పార్టీ తామే గెలుస్తామని ప్రచారం చేస్తుంది. ఇదంతా ఓటర్లను ప్రభావితం చేయడానికే. అలాగే సాధారణ భారతీయ ఓటర్లు ఓడిపోయే వారికి ఓటు వేయడానికి ఇష్టపడరు. ఎన్నికలు అయిపోయిన తరువాత మీరు ఎక్కడికైనా వెళ్ళి అడగండి. 80 నుంచి 90 శాతం మంది మేం గెలిచే పార్టీకే ఓటు వేసామని చెపుతారు. దీన్ని బట్టి గెలిచే వారికే మన ప్రజలు ఓటెయ్యాలనుకుంటారు. తప్ప ఓడిపోతారనుకున్నవారికి ఓటు వేస్తే తమ ఓటు వృథా అవుతుందని కూడా భావిస్తారు. 

చివరి నిమిషంలో..
కేవలం 20 శాతం మంది మాత్రమే ఎవరికి ఓటు వేయాలనే విషయంలో ఆలస్యంగా నిర్ణయం తీసుకుంటారు. అందుకే తమ పార్టీయే గెలుస్తుందన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించడం అన్ని పార్టీలకూ అవసరం. 2014 ఎన్నికల్లో ఈ అవగాహనే ఎక్కువగా పనిచేసింది. నిజానికి ప్రజల్లో ఒక బలమైన అభిప్రాయాన్ని కల్పించడం ఈ దేశంలో ఏ ఎన్నికలనైనా ప్రభావితం చేస్తుంది. ఒకసారి ప్రజల్లో బలమైన అభిప్రాయాన్ని కలగజేయగలిగితే ఓటు వేయడానికి ముందు గతంలో ఆ ప్రభుత్వం చేసిన పనులను ప్రజలు పెద్దగా పట్టించుకోరు. పెద్ద పెద్ద ప్రదర్శనలూ, హోర్డింగులూ ప్రజాభిప్రాయాన్ని మలచడానికి ఉపయోగపడతాయి, విజయానికి సాయపడతాయి. ఏదైనా పార్టీ పెద్ద పెద్ద ర్యాలీలు నిర్వహించకపోతే అది ఓటమిని అంగీకరిస్తున్నట్టు లెక్కకడతారు ప్రజలు. 

ఎన్నికలకు ముందు..
ఎన్నికల్లో ఎవరికి ఓటు వెయ్యాలి అనే అభిప్రాయాన్ని అప్పటికప్పుడు మార్చుకునేవారు 40–45 శాతం నుంచి 20–25 శాతానికి తగ్గారు. ఎన్నికల తేదీలను ప్రకటించటానికన్నా ముందుగానే జనం తామెవరి పక్షమో నిర్ణయించుకుంటున్నారు. ఈ ఒరవడి ప్రతి ఎన్నికల్లోనూ పెరుగుతూ వస్తోంది. 2014 ఎన్నికల్లోనైతే 50 శాతం మంది ఓటర్లు ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. 

పొత్తుల పొడగిట్టని జనం..
పొత్తులపై ప్రజల్లో విశ్వాసం పెద్దగా లేదు. ఎన్నికల్లో గెలుపు కోసం ఈ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న వారు వచ్చే ఎన్నికల్లో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటారు. ఇలాంటి వారిపట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లడం సహజం. మోదీకి వ్యతిరేకంగా ఒక్కటవుతున్న పార్టీలతో ప్రజలకు పెద్దగా సమస్యలేదు. ఎందుకంటే రాబోయే రెండు మూడేళ్ళలో తిరిగి ఆయా పార్టీలు ఒకరికి వ్యతిరేకంగా ఒకరు మారడం ఖాయమని వారు భావిస్తున్నారు. ఒకవేళ  పొత్తులతో వారు గెలిచినప్పటికీ ప్రభుత్వాన్ని కొనసాగించగలరన్న విశ్వాసం ప్రజలకు కలగడం లేదు. అందుకే కొన్ని రాష్ట్రాల్లో స్థానికంగా ప్రాంతీయ పార్టీల పొత్తులు బీజేపీని నిరోధించగలిగినా మహాఘటబంధన్‌ వంటి భారీ పొత్తులు మాత్రం ప్రజలను అంతగా ఆకర్షించలేవు. వ్యతిరేక ప్రచారమే మోదీకి అనుకూలంగా మారే అవకాశం ఉంది.

రైతు.. అటా? ఇటా? ఎటు?

రైతు అన్ని చోట్లా రైతు కాదు. రైతులంతా ఒక్కటీ కాదు. రైతాంగ సమస్యలు ఉత్పన్నమైనప్పుడు రైతులు సంఘటితంగా ముందుకొస్తారు. గ్రామాల్లో మాత్రం రైతులను కులాలో, మతాలో నడిపిస్తాయి. గ్రామాల్లో పెద్ద రైతులు, చిన్న, సన్నకారు రైతులు, మధ్యతరగతి రైతులు ఉంటారు. పెద్ద రైతులతో పోలిస్తే వ్యవసాయ సంక్షోభం కారణంగా బాగా నష్టపోయేది చిన్న, సన్నకారు రైతులే. మిగిలిన రైతులు చిన్నా చితకా వ్యాపారాల్లోనో, ఇతర ఆర్థిక వనరులపైనో ఆధారపడి ఉంటారు. అలాగే చిన్న సన్నకారు రైతులతో పోల్చుకుంటే పెద్దరైతులు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే సంక్షేమ పథకాలన్నీ చిన్న సన్నకారు రైతులనుద్దేశించినవే అయి ఉంటాయి. వంద మందికి మేలు జరిగే పథకం ఉన్నదీ అంటే అది ప్రభుత్వానికి ఎన్నికల్లో పనికొచ్చే అంశమే. అయితే రాజకీయ పార్టీలు భావిస్తున్నంతగా పథకాలు పనిచేయవు. ఎందుకంటే ప్రజలకు సదరు పథకం వల్ల ప్రయోజనం కలుగుతున్నా అది రాష్ట్రప్రభుత్వం ఇస్తోందా? లేక కేంద్రం నుంచి వస్తోందా అన్న గందరగోళం ఉంటుంది. 

ఎగువ మధ్య తరగతికి ‘అవినీతి సమస్య’
ఎగువ మధ్యతరగతి జనం మాత్రమే అవినీతిని గురించి ఎక్కువగా పట్టించుకుంటారు. కానీ మిగిలిన వారికి అవినీతి అంశం పెద్ద సమస్య కాదు. అయితే  అవినీతికీ, ధరల పెరుగుదలకీ ఉన్న సంబంధాన్ని రాజకీయ పార్టీలు ప్రచారం చేయగలిగితే తప్ప అవినీతిని గురించి వారు పట్టించుకోరు. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిందదే. 1989లో వీపీ సింగ్‌ చేసింది కూడా ఇదే. కానీ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటివరకూ ఈ విషయాన్ని ప్రచారంలోకి తేలేకపోయింది. అవినీతి అనేది సాధారణంగా ప్రతి ఎన్నికల్లోనూ ప్రచారాస్త్రమే..

మీడియా ‘కీ’ రోల్‌
ఏదైనా ఒక పార్టీపై ప్రజల్లో బలమైన ముద్ర వేయడంలో మీడియా పాత్ర కీలకం అంటున్నారు నిపుణులు. పార్టీ అభిప్రాయాలు ఏ మేరకు ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతున్నారనే విషయం కూడా ఆ పార్టీ గెలుపుఓటములను ప్రభావితం చేస్తుంది. మీడియా ప్రచారం ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోగలుగుతుంది. అలాగే ఇతర పార్టీలపై అభిప్రాయాలను కూడా ప్రభావితం చేయగలుగుతుంది. ఒకే అబద్ధాన్ని పదే పదే చెబితే ఆ అబద్ధాన్ని సాధారణ ప్రజలు నిజమని నమ్మే ప్రమాదం ఉంటుంది. చివరకు అదే విషయం ప్రజలను ప్రభావితం చేస్తుంది కూడా. ఇది గెలుపోటములపై ప్రభావం చూపుతుంది.

ముస్లింల మొగ్గెటు?
ముస్లింలలోని ఉన్నత వర్గం వారు కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే మొత్తంగా గత కొన్ని ఎన్నికల్లో జాతీయస్థాయిలో 38 నుంచి 39 శాతం ముస్లింలు కాం్ర Vð స్‌కే ఓటు వేసారు. ప్రాంతీయ పార్టీలూ, ఇతర పార్టీలూ కలిపి 56 నుంచి 57 శాతం ముస్లింల ఓట్లను పొందగలిగాయి. అక్కడ స్థానిక రాజకీయాల వల్ల, లేదా పార్టీ అభ్యర్థి కారణంగా 6 శాతం ముస్లింలు బీజేపీకి ఓటేసారు. అయితే ఉత్తర ప్రదేశ్, బిహార్‌లలో కాంగ్రెస్‌కి ముస్లింలు పెద్దగా ఓటు వేయలేదు. కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ ఉండే రాష్ట్రాల్లో మాత్రం ముస్లింల ఓట్లు అత్యధికంగా 75 నుంచి 80 శాతం ఓట్లు కాంగ్రెస్‌ కి పడతాయి. 

బెంగాల్‌..రూటే సెపరేట్‌
బెంగాల్‌లో మమతకి అనుకూలురు, వ్యతిరేకులూ అనే స్పష్టమైన విభజన రేఖ ఉంటుంది. మమతకు వ్యతిరేకంగా ఉన్న వారు బీజేపీ వెనుక సంఘటితమౌతారు. అక్కడ వామపక్షాలా లేక కాంగ్రెస్‌ పార్టీనా అన్నదానితో సంబంధం ఉండదు. బెంగాల్‌లో బీజేపీకి సీట్లు పెరిగే అవకాశం ఉంది. దీనర్థం మమత పాపులారిటీ తగ్గుతోందని కాదు. ఇదంతా మమత వ్యతిరేకుల వల్ల బీజేపీ లాభపడుతుందని మాత్రమే దీనర్థం. మూడున్నర దశాబ్దాల కమ్యూనిస్టుల కంచుకోటని బద్దలుకొట్టిన దీదీ వ్యతిరేకులంతా బీజేపీ వెనుక సంఘటితమౌతున్నారు.

యువోత్సాహం..బీజేపీకే సొంతం

18 నుంచి 23 ఏళ్ళ మధ్య వయస్సు వారు, తొలిసారి ఓటు హక్కు వచ్చిన వారు దాన్ని వినియోగించుకున్నది 1996–2009లో 4 నుంచి 5 శాతం మంది మాత్రమే. అయితే మోదీ ప్రభావంతో 2014లో తొలిసారి ఓటు హక్కుని వినియోగించుకున్నవారు 68 శాతం. దీనర్థం యువతను  మోదీ బాగా ఆకర్షించగలిగారు. అయితే మోదీ ప్రధాని కావాలనుకునే వారు అన్ని వయస్సుల వారూ కలిపి మొత్తం 36 శాతం మంది ఉన్నారు. ఇందులో తొలిసారి ఓటు హక్కుని వినియోగించుకుంటున్నవారు 45 శాతం మంది. అయితే ఈసారి మాత్రం తొలిసారి ఓటర్లలోనూ మోదీ ప్రభావం తగ్గింది. అయితే ఇది కాంగ్రెస్‌కి ఉపయోగపడకపోవచ్చు. మొత్తంగా మోదీ ప్రభావం తగ్గినప్పటికీ తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లు మాత్రం రాహుల్‌కంటే మోదీనే ఇష్టపడుతున్నారు.  

ప్రియాంక అరంగేట్రం.. ఎవరికి నష్టం?
బీజేపీ కంటే ఎస్‌పీ, బీఎస్‌పీకే ప్రియాంక రాజకీయ రంగ ప్రవేశం నష్టం చేకూరుస్తుంది. ఎందుకంటే బీజేపీకి బలమైన సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. అయితే ఎస్‌పీకీ, బీఎస్పీకీ సంప్రదాయ ఓటు బ్యాంకు లేదని కాదు. బీజేపీకి నిజమైన జాతీయ ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని భావించే ముస్లిం కమ్యూనిటీ మాత్రం ఉత్తరప్రదేశ్‌లో ప్రియాంక రాకతో గందరగోళంలో పడే అవకాశం ఉంది. అందుకే యూపీలో ఈసారి ముస్లింలు వ్యూహాత్మకంగా ఓటు వేస్తారని ప్రజలు భావిస్తున్నారు. యూపీలో ఎవరు బలంగా ఉన్నారు అనే విషయాన్ని ముస్లిం కమ్యూనిటీ ఏ ప్రమాణాలతో చూస్తున్నారు అనే దాన్ని బట్టి వారి వ్యూహాత్మక ఓటింగ్‌ ఉంటుంది. దీన్ని అంచనావేయడం కష్టం. అందుకే యూపీలో ముస్లింల ఓట్లు చీలడానికి ఇది దారితీస్తుంది. అందుకే ప్రియాంకా గాంధీ ఎంట్రీ బీజేపీకి అనుకూలిస్తుంది.

ప్రియాంక’ ఎఫెక్ట్‌..
ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ బలం అట్టడుగున ఉంది. 2017లో కేవలం 7 అసెంబ్లీ సీట్లే వచ్చాయి. రాహుల్‌ చెల్లెలు ప్రియాంక రాకతో కాంగ్రెస్‌కి ఆ రాష్ట్రంలో మరో 6 నుంచి 7 శాతం ఓట్లు అదనంగా రావచ్చు. మొత్తం కలిపినా కాంగ్రెస్‌కి రాబోయేది 15 నుంచి 16 శాతం ఓట్లే అని పరిశీలకుల అంచనా. 2014లో బహుజన్‌ సమాజ్‌ పార్టీకి 20 శాతం ఓట్లొచ్చాయి. అయినా ఒక్క సీటు కూడా రాలేదు.

‘పుల్వామా’ బీజేపీకి కలిసొస్తుందా? 

పుల్వామా ఘటన బీజేపీకి వ్యతిరేకత తెచ్చిపెట్టదు. దీని ద్వారా ప్రభుత్వం లబ్ధి పొందుతుంది. పాకిస్తాన్‌కి సరైన బుద్ధిచెప్పాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే పాకిస్తాన్‌కి గుణపాఠం చెప్పగల సత్తా వుందని నిరూపిస్తే చాలు.  అది బీజేపీకి అనుకూలిస్తుందనడంలో సందేహంలేదు. ఏం చేసినా చెయ్యకపోయినా పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రజలు ఉవ్విళ్ళూరుతున్నారు. అది కచ్చితంగా మోదీ అనుకూలతకు నిదర్శనం. 

అసంతృప్తి ఉంది.. కోపం లేదు..
మోదీని తొలగించాలన్న నినాదం గట్టిగా వినిపిస్తున్నా.. నిజానికి క్షేత్రస్థాయిలో జనం మోదీపై అంత కోపంగా ఏమీ లేరు. అయితే ప్రజల్లో కొంత విరక్తి ఉన్నమాట వాస్తవం. మోదీ అనుసరించిన విధానాల వల్ల దళితులు, ఆదివాసీలు, విద్యార్థులు, రైతులు నిరాశతో ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే ప్రజలు అసంతృప్తితోనూ, విరక్తితోనూ ఉన్నమాట వాస్తవమే. అయితే మోదీపైన కోపంగా మాత్రం లేరు. 

రాహుల్‌.. రా..రా!
గతంలో రాహుల్‌గాంధీ ప్రధాని కావాలని 18 నుంచి 20 శాతం మంది కోరుకున్నారు. రాహుల్‌ ప్రధాని కావాలనుకునేవారి సంఖ్య కొద్దిగా పెరిగింది. ఇప్పుడు 27 నుంచి 28 శాతం మంది రాహుల్‌ గాంధీ రావాలని కోరుకుంటున్నారు. అయితే ఇది వాస్తవానికి రాహుల్‌ పాపులారిటీ కాదు. కాంగ్రెస్‌ని కోరుకునే జనం పెరుగుతున్నారని మాత్రమే అర్థం. అచ్చంగా రాహుల్‌ పాపులారిటీ అయితే  22 నుంచి 23 శాతం వరకే ఉంది. ఇందుకు భిన్నంగా దేశంలో 32 నుంచి 33 శాతం మంది బీజేపీకి ఓటెయ్యాలనుకుంటున్నారు.  అయితే 50 శాతం మంది మాత్రం మోదీయే ప్రధానిగా ఉండాలని భావిస్తున్నారు. దీన్ని బట్టి మోదీ పాపులారిటీ బీజేపీకి చాలా వరకు కలిసివస్తోంది. కానీ రాహుల్‌ పాపులారిటీ కాంగ్రెస్‌కి పెద్దగా ఉపయోగపడుతున్నట్టు లేదు.
                                                                                                                                                                                                                    –సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌ 
                                                                                                                                                                                                                                   

Videos

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)