amp pages | Sakshi

గులాబీ మొనగాల్లు దప్ప ఏరే మొగోల్లే లేరా?

Published on Thu, 03/21/2019 - 08:28

పాకిస్తాన్ను శెముటలు పోపిచ్చినోడు దేశమ్‌ల ఎవ్వలన్న ఉన్నరంటె ఒక్క మోడే ... సిగ్రెట్‌ ముట్టిచ్చి అరుగు మీద గూసొని ముచ్చెట మొదలువెట్టిండు మా తాలుక పువ్వు గుర్తు పార్టి లీడర్‌ లస్మయ్య.

ఎక్కన్నొ వున్న దేశెం సంగతెందుకు తీ... పక్క రాశ్టంలున్న చెంద్రాలును నిద్దుర వోకుంట చేసినయిన మా కేసియార్‌ సారు. గులాబి పార్టి దప్ప ఎకేరే పార్టి లేకుంట శేసిన మొనగాడు.. కవుంటరిచ్చిండు గులాబి పార్టి యూత్‌ లీడర్‌ సాగర్‌

రోజు పొద్దూకినంక మాపల్లె దోస్తులం బొడ్రాయి కాడి రాలె శెట్టు కింద గూసొని అదోటిదోటి శెప్పుకుంటం. గట్లనె ఇయ్యల్ల గూసొంగనే ఎంపి ఎలశ్చన్ల ఎవ్వలు గెలుస్తర నుకొంటన్రని నేనే మాటగలిపిన. ఎంటనె ఈల్లిద్దరు అందుకున్నరు.

దేశెంల మొగోడంటె మోడే. లంచాలు, లత్కోరు పన్లు అయినకవుసురవే లేదు. మల్ల పదాన మంతిరి ఆయినే అయితడు..  సిగ్రెట్‌ దమ్ము గుంజి పొగ ఇడుసుకుంట శెప్పవట్టిండు లస్మయ్య

ఇంకేడి పదానమంతిరే. దేశెంల రూపాలను మార్సుడు తోటె సగం ఇజ్జతి వోయింది. నల్లపైసల్ని తెల్లగ జేసుడేందో తెల్వదు గని ఉన్న పైసలు బ్యాంకులల్ల లేకుంట వోయినయి. బ్యాంకుల్ని ముంచినోల్లందర్ని దేశెం దాటిచ్చిండు. ఎలశ్చన్ల ఓడిపోవుడు రొండేండ్ల కెల్లె షురవయింది... పేపర్లల్ల సదివిన సంగతులు యాజ్జేసుకుంట లొల్లివెట్టినట్టే శెప్పిండు సాగరు.

లస్మయ్య ఏదో అనవోతంటె ఆపి... నిన్న మాసారు కర్నారంల శెప్పింది ఇన్లేదా? దేశెంల అగ్గిరాజేత్తనన్నడు. పదారు శీట్లు గెల్శి రాశ్టం కెల్లి దేశానికివోతండు. పదాన మంతిరి అయినా అవ్వచ్చు... ఇన్నవు గదా స్పీచు ..

‘దేశెమంటె తెలంగాననా ఏంది? ఇయ్యల్ల రాశ్టం, దేశెం ఏదన్న గాని ... ఒక్కటె మాట. మోడి మల్లత్తనె  దేశెం  మంచిగుంటదని. కేíసీయారుకు పదారు శీట్లత్తెనె పీయెం అయితడా ? ఈడ గుడ ఈ తాప పువ్వు గుర్తుకె ఓటెత్తరు. పది సీట్లన్న గెలుస్తం’ లస్మయ్య తగ్గకుంట వాదిచ్చుడు స్టాట్‌ జేసిండు. ‘ఈడ టీఆరెస్సుకు ఆల్టర్నేటు మేమే. పోటిచ్చేది, గెల్శేది సుత పువ్వు పార్టే’ అన్నడు.

గీ మాటలు నా శిన్నప్పట్కెల్లి ఇంటన్న . ఎన్కటికి మా తాత చెప్పెటోడు. ‘ఆడు లేత్తె మన్షిగాడని..’ గట్లున్నది నీ లెక్క. మొన్న ఎమ్మెల్లె ఎలశ్చన్ల గదే మాటంటిరి. ఉన్న ఐదింటికి ఒక్కటె మిల్గె. ఏడ డిపాసిట్లు రాకపాయె.  గిప్పుడే లెక్కన ఎంపి శీట్లు గెలుత్తరో? ఎగసెక్కంగ మాట్లాడిండు సాగర్‌

ఈల్లిద్దరి మాటలింటన్న నాకు సమజ్‌గాలె... పువ్వు గుర్తు, కమలం గుర్తేనా దేశెమ్ల ఉన్నయ్‌? మూడురంగుల పార్టి మీ లెక్కల లేదా ఏంది? నేనడిగిన నేను..

సాగర్‌ అందుకుంట... గా పార్టి గుడ గంతె గదనె అన్న. మేం గెలుత్తం... సీయెంల మయితం అన్నోల్లంత పత్తలెకుంట వోయిరి. ఇగ గెల్శినోల్లంత మాకాడికే రావట్టిరి. వున్నోల్లు గుడ శివరాకరికి... మూడు రంగులను గులాబి పార్టిల కలిపేత్తరంట. గీ ఎలశ్చన్లనంగనె ఇండ్లల్ల పండుకున్న లీడర్లంత మల్ల లేశిన్రు.  ఆల్లు గుడ ఎంపిలమయితం అంటన్రు. గా పార్టిల మిగిల్న మొన గాడెవ్వలొ అర్దవయితలే.. అన్నడు శెట్టు కిందికెల్లి లేసుకుంట.

అంటె రాశ్టమె గాదు... దేశెమ్ల ఎలశ్చన్లయితె సుత పదారు సీట్లతోటి గులాబి పార్టేనా శక్రాలు తిప్పేది. పువ్వు గుర్తు పార్టి, మూడు రంగుల పార్టిలకు ఈడ ïశీట్లు రావా? పదారుకు పదారు గెలిత్తె ఈడున్న పార్టీలన్ని ఏంగావాలె? కమ్మునిస్టుల్లెక్క ఉద్దెమాలకేనా? గీ పార్టిలను లేపె మొగోడు, మొనగాడె లేడా..? నా బుర్రల రీల్లు తిరుగుతంటె ఇంటి మొకం బట్టిన. - పోలంపల్లి ఆంజనేయులు, సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌

Videos

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)