నవంబర్‌ మొదటివారంలో కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా

Published on Wed, 10/24/2018 - 02:26

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల జాబితాను నవంబర్‌ మొదటివారంలో ఒకే విడతలో ప్రకటిస్తామని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా తెలిపారు. ఇతర పార్టీలతో పొత్తులపై చర్చలు తుదిదశకు చేరుకున్నాయని, అలాగే అభ్యర్థుల ఎంపికపై క్షేత్రస్థాయిలో పార్టీ స్క్రీనింగ్‌ కమిటీ చేపట్టిన అధ్యయనం ఈ నెలాఖరులో పూర్తవుతుందని అన్నారు. స్క్రీనింగ్‌ కమిటీ సంప్రదింపులు ముగిసిన ఒకటి, రెండు రోజుల అనంతరం నవంబర్‌ మొదటివారంలో కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేసే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు.

మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయా సామాజికవర్గాలకు న్యాయం జరిగేలా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు. బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నేతలతో స్క్రీనింగ్‌ కమిటీ వరుస సమావేశాలు నిర్వహించి నేతల అభిప్రాయాలు సేకరించిందని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీసీలకు టీఆర్‌ఎస్‌ పార్టీ ఇచ్చిన సీట్ల కంటే అధికంగా కాంగ్రెస్‌ పార్టీ ఇవ్వనుందని తెలిపారు. ఈ నెల 27న పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటన ఇంకా ఖరారు కాలేదన్నారు.

ఆరు రోజులపాటు ఆయన తెలంగాణలో పర్యటించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఆ పర్యటనలో ఉదయం మేధావులు, విద్యార్థులు, కార్మికులు, ఆయా సామాజికవర్గాలతో రాహుల్‌ సమావేశమై మధ్యాహ్నం బహిరంగసభల్లో పాల్గొనేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు చెప్పారు. టీఆర్‌ఎస్‌ను గద్దెదించి కాంగ్రెస్‌పార్టీని అధికారంలోకి తేవడమే తమ లక్ష్యమని, దీని కోసం పొత్తుల్లో కొన్ని సీట్లు త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కుంతియా పేర్కొన్నారు.

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)