amp pages | Sakshi

ఎన్టీఆర్‌ను ఓడించిన గడ్డ ఇది.. 

Published on Fri, 11/02/2018 - 13:49

సాక్షి, కల్వకుర్తి: ఎన్టీఆర్‌ను ఓడించిన చరిత్ర కలిగిన క ల్వకుర్తి ప్రజలు.. అదే చైతన్యంతో విషం చిమ్మే చంద్రబాబుతో కూటమిగా వస్తున్న కాంగ్రెస్‌కు త గిన బుద్ధి చెప్పాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చా రు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని కల్వకుర్తిలో గురువారం ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాటుచేశారు. కల్వకుర్తి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జి.జైపాల్‌యాదవ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు ఎంతో చైతన్యవంతులని కొనియాడారు. పాలమూరులో వలసలు నివారించడానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌ను మళ్లీ సీఎంగా తెచ్చకుంటే ఈ జిల్లా పచ్చదనంతో కళకళలాడుతుందని పేర్కొన్నారు.

పాలమూరుకు నీళ్లు రాకుండా అడ్డుకునే ఏపీ సీఎం చంద్రబాబుతో కాంగ్రెస్‌ పార్టీ కూటమిగా వస్తుండడాన్ని ప్రజలు గమనించాలని కోరారు. వెనకబడిన పాలమూరును సస్యశామలంగా మార్చడానికి 50ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్, 17 ఏళ్లు అధికారంలో ఉన్న టీడీపీ ఏ మాత్రం శ్రద్ధ చూపలేదని దుయ్యబట్టారు. అంతేకాదు చంద్రబాబునాయుడు పాలమూరును దత్తత తీసుకుని ఏమీ ఒరగబెట్టలేదని పేర్కొన్నారు. వారు ఏ మాత్రం చొరవ తీసుకుని నీళ్లు తెచ్చినా పాలమూరు ఏనాడో పచ్చబడేదని అన్నారు. వారి నిర్లక్ష్యం పాలమూరు వలసల జిల్లాగా ఉండిపోయిందని.. ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని తెలిపారు.
 
ఆ ఘనత మాదే... 
నాలుగున్నర ఏళ్లలో ఉమ్మడి పాలమూరు జి ల్లాలోని 8లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత సీఎం కేఆర్‌కే దక్కుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. పాలమూరు–రంగారెడ్డి ద్వారా క ల్వకుర్తికి 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని పనులు వేగవంతంగా సాగుతున్నాయని చెప్పారు. కేఎల్‌ఐ నుంచి నాగిళ్ల వరకు దాదాపుగా పనులు పూర్తయ్యాయని.. రెండునెలల్లో నీళ్లు వస్తాయని తెలిపారు. జిల్లాలో అభివృద్ధి పరుగు లు తీయాలంటే కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్‌ ను ముఖ్యమంత్రిగా మరోసారి చేయాల్సిందేనని కేటీఆర్‌ అన్నారు.  మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, నాయకులు మంద జగన్నాథం, పి.రాములు, మున్సిపల్‌ చైర్మన్‌ శ్రీశైలం, మా ర్కెట్‌ చైర్‌పర్సన్‌ విజితారెడ్డి, నాయకులు బాలాజీసింగ్, గోలి. శ్రీనివాస్‌రెడ్డి, ఎడ్మసత్యం, సంజీవ్‌యాదవ్, గోవర్దన్, సూర్యప్రకాష్‌రావు, షాన్‌హాజ్, గోలి సురేందర్‌రె డ్డి, శ్రీనివాస్‌యాదవ్, వెంకటయ్య, మనోహర్‌రెడ్డి, బొల్లె ఈశ్వరయ్య పాల్గొన్నారు.

పరిశ్రమలు కావాలి.. 
టీఆర్‌ఎస్‌ హయాంలో ఎంతో అభివృద్ధి చెందిన కల్వకుర్తి ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరముందని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జైపాల్‌యాదవ్‌ అన్నారు. ఈ ప్రాంతానికి మరింత సాగునీరు అందించడంతోపాటు రెండు పెద్ద పరిశ్రమలు ఏర్పాటుచేయాలని కోరారు. కల్వకుర్తిలో ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాల, ఆమనగల్లులో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా కల్వకుర్తిలో 150 పడకల స్థాయికి ఆస్పత్రికి పెంచాలని కేటీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లారు.

ఎంతో తేడా ఉంది
గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వానికి కల్వకుర్తి ప్రాంతంలో జరిగిన అభివృద్ధి విషయమై ఎంతో తేడా కనిపిస్తోందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోని 17 గ్రామాలకు ఈరోజు సా గునీరు వస్తుందంటే సీఎం కేసీఆర్‌ కృషి, మం త్రి జూపల్లి తోడ్పాటు ఎంతో ఉందని అన్నా రు. రెవెన్యూ డివిజన్‌ రావడానికి మంత్రి కేటీఆర్‌ కృషి ఉందని ఆయన ఆరోజు చొరవ తీసుకోకపోతే రాకపోయేదని తెలిపారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)