amp pages | Sakshi

ఓయూపై కక్షగట్టిన సీఎం కేసీఆర్‌ : కిషన్‌రెడ్డి

Published on Fri, 12/22/2017 - 19:10

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ కోసం పోరాడిన ఉస్మానియా యూనివర్సిటీపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కక్షగట్టినట్టుగా వ్యవహరిస్తున్నాడని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం నాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ..జనవరి 3 నుంచి 7 దాకా జరగాల్సిన సైన్స్‌ కాంగ్రెస్‌ వాయిదా వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలకు ప్రధానమంత్రి హాజరుకావడం ఆనవాయితీ అని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒత్తిడి వల్లనే ఈ సమావేశాలను వాయిదా వేశారని ఆరోపించారు.

ప్రపంచవ్యాప్తంగా 62 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు, నోబెల్‌ బహుమతులు పొందిన వారు ఏడుగురు ఈ సమావేశాలకు హాజరు అవుతామని నమోదు చేసుకున్నారని చెప్పారు. విమాన ప్రయాణపు టికెట్లు, హోటళ్లు, కార్లు వంటివన్నీ బుక్‌ చేసుకున్నారని, వీటికోసం కోట్లాది రూపాయలు ఖర్చు కూడా చేశారని అన్నారు. ఏకపక్షంగా రద్దుచేయడం ద్వారా ఓయూ ప్రతిష్ఠను దెబ్బతీసేవిధంగా వ్యవహరిస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీ, ప్రధాని రాష్ట్రానికి రావడం ఇష్ఠం లేనందుకే సీఎం కేసీఆర్‌కు ఇష్ఠంలేదని ఆరోపించారు. ఇది తెలంగాణకు అవమానమన్నారు. దీనికి సీఎం కేసీఆర్‌ బాధ్యత వహించాలన్నారు.

లక్ష్యం లేకుండానే తెలుగు మహా సభలు సొంత డబ్బాకోసం నిర్వహించారని, రాచరిక పాలనకు తెలుగు మహాసభ వేదిక అయిందని ఆరోపించారు. తెలుగు విశ్వవిద్యాలయానికి ఏమైనా ప్రోత్సాహకాలు ప్రకటించారా, తెలుగు భాషాభివృద్ధికి ఒక్క రూపాయి అయినా కేటాయించారా అని ప్రశ్నించారు. తెలుగు మహాసభలు టీఆర్‌ఎస్‌ మహాసభల్లా జరిగాయన్నారు. మాజీ కేంద్రమంత్రి దత్తాత్రేయను అవమానించే విధంగా వేదిక మీదకు ఆహ్వానించకుండా, మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వేదిక మీదకు పిలిచారని అన్నారు. ఇవేమి తెలుగుసభలో అర్థం కావడంలేదన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన కవులు, కళాకారులకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు.

Videos

అమెరికాలో ప్రమాదంలో ప్రాణాలు విడిచిన తెలంగాణ యువకుడు

చంద్రబాబుకి బయపడి గుళ్లలో తలా దాచుకుంటున్నారు..

తాడిపత్రి హింసాత్మక ఘటనల వెనుక అసలు హస్తం

కుప్పం నుండి ఇచ్చాపురం వరకు అందుకే పోలింగ్ శాతం పెరిగింది

పోలీసులు ఏ రాజకీయ పార్టీల ప్రలోభాలకు లోను కాకుండా నిస్పక్షపాతంగా పనిచెయ్యాలి

ఏపీ ఎన్నికల అల్లర్ల పై సిట్ విచారణ.. ఇప్పటికే పోలీసుల ఫై వేటు

మోడీపై పోటీ చేస్తున్న శ్యామ్ కు షాక్..

మాట నిలబెట్టుకునే మా అన్నకు మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి

అచ్చెన్నాయుడు రిగ్గింగ్.. అడ్డుకున్న వారిపై దాడి

ప్రేమ పేరుతో యువకుడిని మోసం చేసిన యువతి

Photos

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)