amp pages | Sakshi

విడదీయరాని బంధం 

Published on Mon, 03/18/2019 - 06:53

ఈ ఫొటో సరిగ్గా చూశారా.. కుడివైపున సీఎం చంద్రబాబు అని అందరికీ తెలుసు.. పక్కన ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గణబాబులు కూడా చాలా  మందికి తెలుసు. అయితే ఇదే ఫొటోలో ఎడమ వైపున సరిగ్గా చంద్రబాబుకు ఎదురుగా  పసుపు చొక్కా, కండువా వేసుకున్న వ్యక్తి ఎవరో పోల్చుకున్నారా.. ఆయనేనండి.. ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో కీలక వ్యక్తి, ప్రధాన నిందితుడు జె. శ్రీనివాసరావు పని చేసిన ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్‌ ఫుడ్స్‌ హోటల్‌ యజమాని హర్షవర్ధన్‌ చౌదరి. అయితే ఇప్పుడేంటీ అంటారా? గత అక్టోబర్‌ ఆఖరులో దేశ వ్యాప్తంగా ఆ ఘటన కలకలం రేపిన సమయంలో హర్షవర్ధన్‌ చౌదరి మీడియా ముందుకు వచ్చి చాలా బీరాలుపోయారు.

అనవసరంగా నన్ను టీడీపీ వ్యక్తి అంటున్నారని వాపోయాడు. గతంలో గాజువాక టికెట్‌ ఆశించి ఆ పార్టీలో  తిరిగిన మాట వాస్తవమేనని, ఇప్పుడు ఆ పార్టీతో సంబంధం లేదని చెప్పుకొచ్చారు. టీడీపీలో తాను లేనని పలుమార్లు స్పష్టం చేశారు. కానీ ఆదివారం విశాఖ నగరంలో జరిగిన చంద్రబాబు ప్రచార సభలో మాత్రం అన్నీ తానై వ్యవహరించారు. జ్యోతి ప్రజ్వలన మొదలు అన్నీ దగ్గరుండి నడిపించారు. చంద్రబాబు, హర్షవర్ధన్‌ చౌదరిల విడదీయరాని బంధానికి ఇంత కంటే ఏం సాక్ష్యం కావాలి? 
– గరికిపాటి ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌