amp pages | Sakshi

ఆ సీడీల్లో ఉన్నది హార్థిక్‌ పటేలే..!

Published on Tue, 11/14/2017 - 15:19

సాక్షి, అహ్మదాబాద్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పటీదార్‌ ఉద్యమనేత హర్థిక్‌ పటేల్‌ సెక్స్‌ క్లిప్‌ వెలుగుచూడటం కలకలం రేపుతోంది. ఈ వీడియో క్లిప్‌లో ఉన్నది తాను కాదని హార్థిక్‌ పటేల్‌ చెబుతున్నా.. ఈ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ సీడీల్లో ఉన్నది ముమ్మాటికీ హార్థిక్‌ పటేలేనని ఆయన మాజీ అనుచరుడు అశ్విన్‌ తాజాగా వెల్లడించారు. అయితే, ఈ సెక్స్‌ సీడీల విషయమై ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సీడీల్లో ఉన్నది హార్థిక్‌ పటేలేనని, త్వరలో ఆయనకు సంబంధించిన మరిన్ని వీడియోలు బయటపెడతానని అశ్విన్‌ హెచ్చరించారు. హార్థిక్‌ అంతు చూస్తానని అశ్విన్‌ హెచ్చరించారు. అంతేకాకుండా హార్థిక్‌ పటేల్‌ అనుచరులతో కలిసి మద్యం తాగుతున్న వీడియోలు సైతం తాజాగా వెలుగుచూశాయి.

ఓ హోటల్‌ గదిలో ఓ యువతితో ఆయన సన్నిహితంగా గడుపుతున్న వీడియో వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలో ఉంది తాను కాదంటూ ఇప్పటికే హార్దిక్ ఇప్పటికే వివరణ ఇచ్చారు. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలోనే బీజేపీ తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందంటూ ఆయన విమర్శించారు. ఈ విషయంలో దళిత యువ నేత జిగ్నేశ్‌ మెవానీ సైతం స్పందించారు. హార్దిక్ సిగ్గుపడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ‘‘హర్దిక్ నీ వెంట నేనున్నా. శృంగారం అనేది ప్రాథమిక హక్కు. ఏకాంతానికి భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదు’ ’ అని ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు.  అనంతరం  ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన వీడియోలో ఉన్నది అతనే అయినా తప్పేం కాదని.. ఆ వీడియోను ఎవరైతే బయటపెట్టారో వారిని హర్దిక్‌ కోర్టుకు ఇడ్చాల్సిందే అని జిగ్నేశ్‌ సలహా ఇస్తున్నారు.

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌