అలా గెల్చి మొనగాడు అనిపించుకోవాలి

Published on Thu, 06/13/2019 - 14:24

సాక్షి, సిద్ధిపేట :  కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను  చేర్చుకుని ప్రతిపక్షాలు లేకుండా చేసి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతోష పడుతున్నారని సీపీఐ  రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మండిపడ్డారు. అభివృద్ధి కోసం పార్టీ మారితే రాజీనామా చేసి పార్టీ మారాలని, గెల్చి మొనగాడు అనిపించుకోవాలని సూచించారు. గురువారం సీపీఐ పార్టీ కార్యాలయంలో సిద్ధిపేట మొదటి శాసన సభ్యుడు ఎడ్ల గురువారెడ్డి 8వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ..  తెలంగాణలో సమస్యలు కోర్టుల ద్వారానే తప్ప ప్రభుత్వం పరిష్కరించడం లేదన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాదర్బార్ ఏర్పాటు చేస్తూ ఉంటే, కేసీఆర్‌ మాత్రం ఐదేళ్లు గడిచినా ప్రజలను కలవడం లేదని అన్నారు. వైఎస్‌ జగన్‌కు ఉన్న ఆలోచన కేసీఆర్‌కు లేదన్నారు. కేసీఆర్ పాలనలో అసెంబ్లీ కూడా హైకోర్టులో బంధీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల ప్రారంభానికి ప్రతిపక్షాలను కూడా ఆహ్వానించాలని సూచించారు.ఈ నెల19,20 తేదీలలో సీపీఐ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తుందని తెలిపారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ