amp pages | Sakshi

ఒకవేళ కశ్మీర్‌లో హిందువులు ఎక్కువగా ఉంటే..

Published on Mon, 08/12/2019 - 17:14

న్యూఢిల్లీ: ఒకవేళ జమ్మూకశ్మీర్‌లో హిందూ ప్రజల ప్రాబల్యం ఎక్కువగా ఉండి ఉంటే..  బీజేపీ ఆ రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తిని ఎప్పటికీ రద్దు చేసి ఉండేది కాదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పీ చిదంబరం పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జమ్మూకశ్మీర్‌ ఈ రోజు ఒక మున్సిపాలిటీగా మారిపోయింది. ఇతర రాష్ట్రాలకు ఆర్టికల్‌ 371 కింద ప్రత్యేక రక్షణలు ఉన్నాయి. ఒక్క జమ్మూకశ్మీర్‌కు మాత్రమే ఎందుకు తొలగించారు. ఎందుకంటే ఇది మతమౌఢ్యం కాబట్టి’ అని చిదంబరం బీజేపీపై ధ్వజమెత్తారు.

జమ్మూకశ్మీర్‌లో ముస్లిం ప్రజలు అధికంగా ఉన్నారు కాబట్టే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని, ఒకవేళ అక్కడ హిందువుల ఆధిక్యత ఉండి ఉంటే బీజేపీ ఈ నిర్ణయం తీసుకోనేది కాదని పేర్కొన్నారు. చిదంబరం వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. చిదంబరం వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా, బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని, కేంద్రం నిర్ణయానికి కాంగ్రెస్‌ మత కోణాన్ని ఆపాదిస్తోందని కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మండిపడ్డారు. దశాబ్దాల కింద కాంగ్రెస్‌ చేసిన చరిత్రాక తప్పిదాన్ని బీజేపీ ప్రభుత్వం సరిచేసిందని మరో కేంద్రమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వి పేర్కొన్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)