amp pages | Sakshi

రావాలి మార్పు..ఇవ్వాలి తీర్పు

Published on Wed, 04/10/2019 - 20:20

మునిగిపోయాం
ఏ పంటకూ గిట్టుబాటు ధర కల్పించలేని మీ అసమర్థపాలనతో నిండా మునిగిపోయాం. రైతుల ఆత్మహత్యలు చూశాం. అదేమి విచిత్రమో కానీ మీరు ముఖ్యమంత్రి అయితే వర్షాలు కూడా ముఖం చాటేస్తున్నాయి. కరువు విలయతాండవం చేస్తోంది. గిట్టుబాటు ధర కోసం పలు మార్లు ఆందోళనలు చేయాల్సి వచ్చింది. విత్తనాల కోసం క్యూలో నిలబడ్డాం. ఎరువుల ధరలతో పంటల సాగు కష్టంగా మారింది. మీ ఖజానా నింపుకోవడానికి కేంద్రం ఒక వైపు, మీరు మరో వైపు పోటాపోటీగా పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచి ప్రతి దానికి అదనపు భారాన్ని మోపారు. ఇందుకు తగిన గుణపాఠం చెప్పేందుకు రైతాంగం ఎదురు చూస్తోంది.

అలసి పోయాం
మీ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ సంక్షేమ ఫలాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదరుచూసి అలసి పోయాం. మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులనే లబ్ధిదారులుగా ఎంపిక చేసుకున్నారు. పింఛన్లు, కార్డుదారులు, ఇళ్లు, కార్పొరేషన్‌ రుణాలు కోసం జన్మభూమి కమిటీల సిఫార్సుల కోసం నానా అగచాట్లు పడ్డాం. మీరు ముఖ్యమంత్రి అయ్యే రోజు వరకు రేషన్‌ దుకాణాల్లో 9 సరుకులు వస్తుండగా.. మీ జమానాలో వాటిని నాలుగుకు కుదించారు. పారదర్శకత పేరుతో ఈ–పాస్‌ విధానాన్ని తీసుకొచ్చి మా సహనానికి పరీక్ష పెట్టారు. రేషన్‌ దుకాణాల వద్ద సరుకుల కోసం రోజుల తరబడి నిరీక్షించాం. నాలుగేన్నరేళ్ల తర్వాత నిరుద్యోగ భృతి ప్రవేశ పెట్టి సవాలక్ష ఆంక్షలతో అర్హులను ఏరిపారేశారు. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు. మీ విధానాలతో ఐదేళ్లుగా అలసిపోయాం. 
వెనుకబడ్డాం:
మీ ఎలుబడిలో అభివృద్ధిపరంగా వెనుకడి పోయాం. గాలేరు–నగరి పనులు సాగుతూనే ఉన్నాయి. జిల్లాకు ఉక్కు పరిశ్రమ అంటూ హోరెత్తించారు. అభివృద్ధి ఊపందుకుంటుందని ఊదరగొట్టారు. కానీ శంకుస్థాపనతోనే ముగించారు. విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశారు. జిల్లాను మరింత వెనుకకు నెట్టేశారు. 

అసహ్యించుకుంటున్నాం
తమరి ఐదేళ్ల పాలనలో జరిగిన అవినీతిని చూసి అసహ్యించుకుంటున్నాం. ప్రకృతి సంపదను యథేచ్ఛగా కొల్లగొట్టి సొమ్ము చేసుకున్నారు. ఎర్రచందనం, ఇసుక, ఎర్రమట్టి, కంకర వంటి వాటిని జిల్లా సరిహద్దులు దాటించి మీ పార్టీ నాయకులు రూ.కోట్లు సంపాదించుకున్నారు. అభివృద్ధి పనుల పేరుతో నీరు–చెట్టు పథకాన్ని పసుపుమయం చేశారు. సీసీ రోడ్లు, చెక్‌డ్యాం నిర్మాణాలు, ఇంకుడు గుంతలు, డ్రైనేజీలు ఆఖరికి మరుగుదొడ్లనూ వదలకుండా దోచుకున్నారు. ఉపాధి హామీ పథకం నిబంధనలు మార్చి తమ్ముళ్లకు దోచి పెట్టారు. తెలుగు తమ్ముళ్ల భూ కబ్జాలతో సామాన్యుల గుండెల్లో వణుకు పుట్టింది. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి పనికి ఒక రేటు పెట్టి సామాన్యులైన మాకు నరకం చూపించారు.

మీ ఐదేళ్ల పాలన మాకు అసహ్యాన్ని కలిగిస్తోంది. తమరి ఐదేళ్ల పాలనలో జరిగిన అవినీతిని చూసి అసహ్యించుకుంటున్నాం. ప్రకృతి సంపదను యథేచ్ఛగా కొల్లగొట్టి సొమ్ము చేసుకున్నారు. ఎర్రచందనం, ఇసుక, ఎర్రమట్టి, కంకర వంటి వాటిని జిల్లా సరిహద్దులు దాటించి మీ పార్టీ నాయకులు రూ.కోట్లు సంపాదించుకున్నారు. అభివృద్ధి పనుల పేరుతో నీరు–చెట్టు పథకాన్ని పసుపుమయం చేశారు. సీసీ రోడ్లు, చెక్‌డ్యాం నిర్మాణాలు, ఇంకుడు గుంతలు, డ్రైనేజీలు ఆఖరికి మరుగుదొడ్లనూ వదలకుండా దోచుకున్నారు. ఉపాధి హామీ పథకం నిబంధనలు మార్చి తమ్ముళ్లకు దోచి పెట్టారు. తెలుగు తమ్ముళ్ల భూ కబ్జాలతో సామాన్యుల గుండెల్లో వణుకు పుట్టింది. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి పనికి ఒక రేటు పెట్టి సామాన్యులైన మాకు నరకం చూపించారు. మీ ఐదేళ్ల పాలన మాకు అసహ్యాన్ని కలిగిస్తోంది. 

ఉక్కుపాదం మోపారు
ఐదు కాదు పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఉండేలా తీసుకొస్తామని ఎన్నికల ప్రచారంలో నమ్మించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత.. హోదా సంజీవని కాదన్నారు. ప్యాకేజీకి ఒప్పుకున్నారు. ప్రత్యేక హోదా కోసం విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, ప్రతిపక్ష పార్టీలు చేసిన ఉద్యమాన్ని అణచివేశారు. సీపీఎస్‌ రద్దు కోసం ఉపాధ్యాయులు, పీఆర్సీ కోసం ఆర్టీసీ కార్మికులు, వేతనాల కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు, భవిష్యత్తుపై ఆందోళనతో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు, ఆశావర్కర్లు ప్రజాస్వామ్య పద్ధతిలో  నిరసన తెలిపే హక్కును కాలరాశారు. అరెస్టులు చేయించి పోలీస్‌స్టేషన్లలో కూర్చోబెట్టారు. 

విసిగిపోయాం
మీ అబద్ధపు హామీలతో పూర్తిగా విసిగిపోయాం. గత ఎన్నికల్లో ఒకటా.. రెండా.. ఏకంగా ఆరు వందల హామీలు ఇచ్చారు. రైతుల రుణాలు మొత్తం మాఫీ చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి రాగానే రుణమాఫీని రూ.లక్ష యాభై వేలకు కుదించారు. ఒకటి, రెండు, మూడు అంటూ విడతలుగా నగదు జమ చేస్తానన్నారు. మీరిచ్చిన మాఫీ డబ్బు బ్యాంకుల వడ్డీలకు కూడా సరిపోలేదు. డ్వాక్రా సంఘాలకు సంపూర్ణ రుణమాఫీ అన్నారు. అది కూడా నాలుగేళ్లు సాగదీసి చివరకు రూ.10 వేలు జమ చేశారు. మిమ్మల్ని నమ్ముకుని బ్యాంకుల్లో డిఫాల్టర్లు అయ్యాం. ఏ ఒక్క హామీని సంపూర్ణంగా 
నెరవేర్చని మీ బూటకపు పాలన రికార్డు సాధించింది. 

మీ మాటలు నమ్మంబాబు


రైతులకు రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అధి కారం చేపట్టాక సవాలక్ష నిబంధనలు పెట్టి అరకొరగా విదిల్చారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చే సరికి బూటకపు హామీలిస్తున్నారు. నిన్ను నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరు. ప్రతి ఒక్కరూ మార్పు కోరుకుంటున్నారు.    
 

మరోసారి మోసపోయాం


ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత పెద్ద దిక్కుగా ఉంటారని భావించి గెలిపించాం. హామీలు నెరవేరుస్తారని నమ్మాం. గత ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామని చెప్పారు. కానీ నెరవేర్చలేదు. ఈ సారి మోసపోవడానికి సిద్ధంగా లేం – బాబ్జీ, బద్వేలు

హామీలు నెరవేర్చలేదు

భూమిలేని నిరుపేదలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పట్టాలిచ్చి రైతులుగా మార్చారు. గత ఎన్నికల్లో ప్రతి నిరుపేదకూ సాగుభూమి ఇస్తామని హామీ ఇచ్చా రు. ఇంత వరకు నెరవేర్చలేదు. ఎలా నమ్మేది? – గురప్ప, పుల్లారెడ్డిపల్లె, కలసపాడు      – షరీఫ్, బద్వేలు 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)