amp pages | Sakshi

బాబూ... హామీలు గుర్తున్నాయా?

Published on Wed, 03/27/2019 - 09:55

సాక్షి,మడకశిర: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టీడీపీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనడానికి బుధవారం మడకశిరకు వస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా 2016 డిసెంబర్‌ 2వ తేదీ మడకశిరకు వచ్చారు. ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు మడకశిర నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నో హామీలిచ్చారు. కానీ వాటిని ఇంతవరకూ నెరవేర్చలేదు. దీంతో ఇక్కడి ప్రజలు ఇప్పుడు ఆయన పర్యటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు మడకశిర ప్రాంతంలో ఓట్లడిగే అర్హత లేదంటున్నారు.

హంద్రీ – నీవా కాలువ: మడకశిర నియోజకవర్గానికి హంద్రీ – నీవా పథకం ద్వారా సాగునీరు అందించి రైతులను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. నెరవేర్చలేదు. సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హంద్రీ – నీవా ద్వారా సాగునీరు అందిస్తామని హడావుడి చేసిన స్థానిక టీడీపీ నాయకులు చివరకు చేతులెత్తేశారు.

పారిశ్రామిక వాడ: మడకశిరలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు 1,600 ఎకరాలు సేకరించారు. ఈ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఇంతవరకు ఒక్క పరిశ్రమను కూడా ఏర్పాటు చేయలేదు. భూములిచ్చిన రైతులకు నష్ట పరిహారం కూడా అందించలేదు. దీంతో రైతులు, నిరుద్యోగులు చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

డ్రైనేజీ వ్యవస్థ: మడకశిరలో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయిస్తానని, అందుకోసం నిధులు పెద్దఎత్తున అందిస్తానని ప్రకటించారు. ఒక్క పైసా కూడా మంజూరు చేయలేదు.
కార్యరూపం దాల్చని రింగ్‌ రోడ్డు: మడకశిరలో రింగ్‌రోడ్డు ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.45 కోట్ల నిధులను మంజూరు చేశామని చెప్పారు. అయితే ఇప్పటికీ రింగ్‌ రోడ్డు పూర్తి కాకపోవడంపై పట్టణ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఏర్పాటు కాని డిగ్రీ కళాశాలలు: అమరాపురం, గుడిబండలో డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. కానీ చేయలేదు. దీంతో ఈ రెండు మండలాల విద్యార్థులు అనేక అగచాట్లు పడుతున్నారు.
100 పడకల ఆస్పత్రి: మడకశిర ప్రభుత్వ ఆస్పత్రి స్థాయి 50 పడకలైతే 100 పడకలకు పెంచుతామని చెప్పారు. నిన్నమొన్నటి వరకూ పట్టించుకోకుండా నెలరోజుల క్రితం 100 పడకల ఆస్పత్రిగా మారుస్తూ జీఓ జారీ చేశారు. తదుపరి చర్యలు తీసుకోలేదు.

పర్యాటక కేంద్రాలు: నియోజకవర్గంలోని రత్నగిరి, హేమావతి, భక్తరహళ్లి, జిల్లేడుగుంటలను పర్యాటక కేంద్రాలుగా మారుస్తానని హామీ ఇచ్చారు. కానీ వాటి గురించి పట్టించుకోలేదు.
రాళ్లపల్లి రిజర్వాయర్‌: గుడిబండ మండలం రాళ్లపల్లి వద్ద హంద్రీ – నీవా రిజర్వాయర్‌ నిర్మించి నియోజకవర్గంలోని అన్ని చెరువులనూ నింపుతామన్నారు. ఇంతవరకూ అది కార్యరూపం దాల్చకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

హామీలు నెరవేర్చి మడకశిరకు రావాలి
2016లో చంద్రబాబు మడకశిరకు వచ్చినప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు. అయితే ఇంతవరకూ అవి నెరవేరలేదు. వాటిని నెరవేర్చిన తర్వాతే ఆయన మళ్లీ మడకశిరకు రావాలి. హామీలను నెరవేర్చని సీఎంను మడకశిర ప్రజలు నిలదీయాలి.

– లక్ష్మీనారాయణ, హరేసముద్రం, మడకశిర 

 చంద్రబాబు మోసం చేశారు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మడకశిర ప్రజలను మోసం చేశారు. ముఖ్యంగా పారిశ్రామికవాడ ఏర్పాటు చేయకుండా నిరుద్యోగులను ముంచేశారు. మళ్లీ మడకశిరకు వచ్చి ఓట్లు అడిగే అర్హతను కోల్పోయారు.

మంజునాథ్, జిల్లేడుగుంట, మడకశిర 

Videos

కడపలో దుమ్ములేపుతున్న అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం

సంక్షేమ పథకాలతో జనం సంతోషంగా ఉన్నారు: విజయానంద్ రెడ్డి

చంద్రబాబుకు అనిల్ కుమార్ యాదవ్ సవాల్

మోదీని ఢీకొట్టే సత్తా సీఎం జగన్ కే ఉంది

వీడియో చూపించి షర్మిల బండారం బయటపెట్టిన పొన్నవోలు

పెమ్మసాని...కాసుల కహానీ

కూటమి మేనిఫెస్టోపై రాచమల్లు కామెంట్స్

మోదీ ఫోటో లేకుండా చంద్రబాబు 420 మేనిఫెస్టో..

చంద్రబాబుది బోగస్ రిపోర్ట్..

అన్నావదినపై విషం కక్కుతారా..

పింఛన్ దారులకు పెన్షన్ కానుక పంపిణీ..

షర్మిల ఆడియో లీక్

అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్

హామీలు కాదు..చెవిలో పువ్వులు..టీడీపీ మేనిఫెస్టో చూసి మోదీ షాక్

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)