జ్వరాలు విజృంభిస్తున్నా మొద్దు నిద్రా ?

Published on Sun, 10/22/2017 - 02:13

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాల బారిన పడి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటుంటే సీఎం చంద్రబాబు మాత్రం విదేశీ పర్యటనలు చేస్తున్నాడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి ధ్వజమె త్తారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రోజూ చెబుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదన్నారు.

సీఎం కోర్‌ డ్యాష్‌ బోర్డు సమాచారం ప్రకారమే వారం రోజుల్లో డెంగీ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 305కు చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో ఇప్పటికే రెండు వారాల్లో 82 మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ