amp pages | Sakshi

మాఫీ మాయ!

Published on Fri, 03/09/2018 - 09:06

సాక్షి, అమరావతి : ఈ ప్రభుత్వంలో ఇదే చివరి బడ్జెట్‌.. ఇంకేం సాయం చేస్తారు? ఈ సర్కారు చెప్పిందేమిటి? చేసిందేమిటి? అని అన్నదాతలు నిప్పులు చెరుగుతున్నారు. అధికారంలోకి రాగానే రైతన్నల పంట రుణాలు రూ.87,612 కోట్లు బేషరతుగా మాఫీ చేస్తామన్న చంద్రబాబు గద్దెనెక్కగానే మాట మార్చారు. అప్పు మాఫీ అవుతుందనే ధీమాతో ఉన్న వారందరికీ అసలుతో పాటు వడ్డీ కలిపి తడిసి మోపెడైంది. మాఫీ సొమ్ము పావు వంతు వడ్డీకి కూడా సరిపోక ఎక్కడికక్కడ అప్పులు అలానే ఉండిపోయాయి. అప్పు ఎగవేతదారులుగా ముద్ర పడటంతో బ్యాంకుల్లో కొత్త అప్పులు పుట్టక, ఉన్నవి మాఫీ కాక అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. సున్నా వడ్డీకి రుణాలు లభించక బయట అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పంటలు సాగు చేసి అప్పులపాలయ్యారు. కాకి లెక్కలు వేసిన సర్కారు రైతుల రుణాలను రూ.24,500 కోట్లకు కుదించినా, ఆ ఈ మేరకు కూడా మాఫీ చేయలేకపోయింది.

ఈ మొత్తాన్ని కూడా విడతల వారీగా చెల్లిస్తామని బాండ్లు పంపిణీ చేసింది. ఏటా బడ్జెట్‌లో అత్తెసరు నిధుల కేటాయింపుతో ఈ మాత్రం హామీని కూడా నిలుపుకోలేకపోయింది. అంకెల గారడి చేసి మాఫీ చేసేశామంటోంది. 2015–16 ఆర్థిక సంవత్సరం వరకు రూ.10,867 కోట్లు ఇవ్వగా, 2017–18లో రూ.3,629 కోట్లు కేటాయించింది. అయితే ఇందులో విడుదల చేసింది మాత్రం రూ.3,069 కోట్లే. ఈ విషయాన్ని వ్యవసాయ బడ్జెట్‌లో ప్రభుత్వమే స్పష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్‌లో రుణమాఫీ కింద సర్కారు తేల్చిన అప్పుల ప్రకారమే అనుకున్నా రూ.10,564 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.4,100 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే కోత వేసి.. కాకి లెక్కలు వేసిన సొమ్ములోంచి కూడా రూ.6,464 కోట్ల కేటాయింపులను గాలికి వదిలేసింది. ఈ సొమ్మును ఎలా సర్దుబాటు చేస్తారో చెప్పలేదు. మొత్తంగా సర్కారు చర్యలతో రైతులు కోలుకోలేని ఊబిలో కూరుకుపోయారన్నది స్పష్టమైంది.

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)