amp pages | Sakshi

స్క్వాష్ @ 800 ఏళ్లు

Published on Tue, 10/06/2015 - 00:11

తవ్వకాల్లో బయటపడిన 800 ఏళ్ల నాటి విత్తనాల్ని సాగు చేస్తున్నారు కెనడాలోని విన్నీపెగ్‌కు చెందిన కెనడియన్ మెన్నోనైట్ విశ్వవిద్యాలయం విద్యార్థులు. బడి, కళాశాల, విశ్వవిద్యాలయాల్లో మొక్కల్ని పెంచడం సర్వసాధారణం. అయితే కెనడాలోని కెనడియన్ మెన్నోనైట్ యూనివర్శిటికి చెందిన విద్యార్థులు మాత్రం పురాతన విత్తనాల్ని సాగుచేస్తూ వార్తల్లో నిలిచారు. కెనడాలోని పురావస్తు శాస్త్రరీత్యా ప్రాధాన్యత కలిగిన ‘ఫస్ట్ నేషన్స్ ల్యాండ్’ ప్రదేశాల్లో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో ఈ పురాతన విత్తనాలు వెలుగు చూశాయి. ఈ తవ్వకాల్లో 800 ఏళ్ల నాటి మట్టి పాత్ర ఒకటి బయటపడింది.
 
 ఆ పాత్రనిండా విత్తనాలు ఉన్నాయి. ఆ విత్తనాలను స్క్వాష్ విత్తనాలుగా గుర్తించారు పురావస్తు విభాగం శాస్త్రవేత్తలు.  ఈ విత్తనాలను  కెఎంయూకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున సాగు చేయడం మొదలు పెట్టారు. ఆ విత్తనాలు మొలకెత్తి ఏపుగా పెరుగుతున్నాయి. మరికొన్ని మొక్కలు కాయల్ని కూడా కాస్తున్నాయి. చూడ్డానికి కూరగాయకంటే పెద్దగా ఉన్న ఈ స్క్వాష్ కాయ చాలా పొడవుగా పెరుగుతోంది. అయితే, విద్యార్థులు మాత్రం ఈ కాయను విత్తనాల కోసం అలాగే ఉంచేస్తున్నారు. ‘ఈ స్క్వాష్ కూరగాయ గిరిజన తెగకు చెందిన ఓ వర్గానికి ప్రతీకగా మేం భావిస్తున్నాం. భవిష్యత్తు తరాలకు ఈ స్క్వాష్ కాయను అందించాల నుకుంటున్నాం. ఈ స్క్వాష్ కాయనుంచి మరిన్ని విత్తనాలు సేకరించాలనుకుంటున్నాం. ఈ స్క్వాష్ విత్తనాన్ని మరోసారి నాశనం కానివ్వమంటు’న్నారు విన్నీపెగ్ కు చెందిన మొక్కల పెంపకం సమన్వయకర్త బ్రెయిన్ ఎత్కిన్.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)