amp pages | Sakshi

కవిత్వంపై కవిత్వం లాంటి పుస్తకం

Published on Mon, 05/29/2017 - 00:00

కవిత్వంలో నేను – మరికొన్ని వ్యాసాలు; రచన: విన్నకోట రవిశంకర్‌; పేజీలు: 288; వెల: 150; ప్రచురణ: వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా; ప్రతులకు: జె.వి.పబ్లిషర్స్, నవోదయా బుక్‌ హౌజ్‌

విన్నకోట రవిశంకర్‌ తెలుగు కవిత్వంలో బాగా విన్న పేరే. ‘కుండీలో మర్రిచెట్టు’, ‘వేసవి వాన’, ‘రెండో పాత్ర’ సంకలనాలతో తనదైన ముద్ర వేసినవాడు. కవిత్వ రచనలో భాగంగా తన అనుభవాలనుంచి తను గ్రహించిన విషయాలు, ఇతర కవుల రచనలను చదివే సమయంలో తను గమనించిన వివరాలను అనేక వ్యాసాలుగా రాశాడు. అలా గత 18 సంవత్సరాలుగా వివిధ అంతర్జాల పత్రికలలో రాసిన వ్యాసాలు, సమీక్షలు, మరికొన్ని ప్రసంగ పాఠాలతో కూర్చిన సంకలనం ‘కవిత్వంలో నేను’.

ఇస్మాయిల్‌ అభిమానిగా, ఆరాధకుడిగా రవిశంకర్‌కు కవిత్వం పట్ల, కవుల పట్ల కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి. సరళత, నిరాడంబరత, స్పష్టత, గాఢతలను మంచి కవిత్వానికి మూలసూత్రాలుగా భావిస్తాడు. కవులకు పొయెటిక్‌ ఈగో లేకపోవడాన్ని అనగా కవి పాఠకుని కంటే ఒక ఉన్నతాసనం మీద ఉండి ప్రవచించటం కాకుండా వారిలో ఒకనిగా వారి కష్టాలు, సుఖాల గురించిన స్పందనలందించటాన్ని అభిమానిస్తాడు. ఏ కవి గురించి మాట్లాడ్తున్నా, ఎవరి కవిత్వాన్ని విశ్లేషిస్తున్నా పుస్తకంలోని వ్యాసాలన్నింటా ఇదే అంతస్సూత్రంగా ఆవరించి వుంటుంది.

‘కొన్ని సందర్భాల్లో కవిత రాయకపోవడం కన్నా రాయటమే ఒక రకమైన ఇన్సెన్సిటివిటీని సూచిస్తుంది’ అన్నప్పుడూ, ‘మరణించినవారిని ఇంటికి చేర్చకముందే మన కవులు పద్యం మొదలు పెడుతున్నారా, అంత్యక్రియలు పూర్తి కాకుండానే అంత్యప్రాసల కోసం వెతుకుతున్నారా అని నాకు అనుమానం కలుగుతుంది’ అన్నప్పుడూ అది మనకూ నిజంగానే తోస్తుంది.

మంచి కవిత్వాన్ని చదవాలి, మళ్ళీమళ్ళీ మననం చేసుకోవాలి, విశ్లేషణ బహానాతో దాన్ని మరో నలుగురికి చేరవేయాలి, తద్వారా మంచి కవిత్వం కొనసాగింపునకు మనకు తోచిన బాట వెయ్యాలి అనే తపన పుస్తకంలో సుస్పష్టం. అలా తనకు నచ్చిన కవిత్వాన్ని పాఠకులతో పంచుకునే క్రమంలో ఇస్మాయిల్, ఆశారాజు, శిఖామణి, సిద్ధార్థ, శ్రీకాంత్, బి.వి.వి.ప్రసాద్, రమణజీవి, కొత్తపల్లి శ్రీమన్నారాయణ, యార్లగడ్డ రాఘవేంద్రరావు మొదలైన కవుల కవిత్వాన్ని ప్రేమగా తడిమాడు. సూటిగా, క్లుప్తంగా, అవసరమైన చోటల్లా అవసరమైనంత మేరకు కవితాత్మక ఉదాహరణలతో రసవంతంగా పుస్తకాన్ని తీర్చిదిద్దాడు. ‘ఎందుకు బతకాలి?’ అనే ప్రశ్నకు ఇస్మాయిల్‌ చెప్పిన సమాధానం ‘ఎండ వెచ్చగా వుంది, పచ్చిక పచ్చిగా వుంది, ఇక్కడింత హాయిగా వుంటే బతకటానికేమయ్యిందయ్యా నీకు?’ లాంటి సమయస్ఫూర్తి సంభాషణలు మరోమారు గుర్తుకు తెచ్చుకోవడానికి ఈ పుస్తకం ఒక మంచి సందర్భం.

వ్యాసాల్లో వీలు దొరికినప్పుడల్లా తను రాసిన కవిత్వాన్ని ముందుకు తీసుకురావడానికి కవి రచయిత పడ్డ అదనపు తాపత్రయం కలిగించే కొంత అసౌకర్యం తప్పిస్తే, ఇది మంచి కవిత్వ వ్యాసాల సంకలనం!

ఎమ్మార్‌ ఆనంద్‌
emmar.anand@gmail.com

#

Tags

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)