amp pages | Sakshi

పట్టు రైతుల గోస పట్టదా?

Published on Fri, 10/16/2015 - 01:59

సందర్భం
 రాష్ట్రంలో రైతుల ఆత్మ హత్యల పరంపర కొనసా గుతోంది. ఇప్పటివరకు అసువులు తీసుకుంటున్న రైతుల్లో ఎక్కువ మంది పత్తి, మిర్చి సేద్యపుదా రులే కావడం గమనార్హం. రైతుల విషయంలో సర్కా రు  ఆలోచనా విధానంలో మార్పులు రాకపోయినట్లయితే భవిష్యత్తులో పట్టు రైతులను కూడా ఇదే కోణంలో చూడాల్సిన పరిస్థితి అనివార్యమవుతుంది. గడచిన రెండేళ్లలో తెలంగాణ రాష్ర్టంలో పట్టు రైతుల సంఖ్య గణనీయంగా పెరి గింది. మల్బరీ తోటలు పెంచండి, వాణిజ్య పంటల కన్నా అధిక లాభాలు పొందండి అంటూ అర్భాటపు ప్రచారం చేస్తున్న పట్టు పరిశ్రమశాఖ అధికారులు ఆ తర్వాత రైతుల  గురించి పట్టించుకోవడం లేదు.

తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ జిల్లా జనగామ కేంద్రాల్లో మాత్రమే పట్టుగూళ్ల మార్కె టింగ్ సదుపాయం ఉంది. రాజధాని నగరంలోని తిరుమలగిరి మాత్రమే పూర్తిస్థాయి ప్రభుత్వ పట్టు గూళ్ల  మార్కెట్ కాగా, జనగామలో గల సౌకర్యాన్ని నోటిఫైడ్ మార్కెట్టుగా వ్యవహరిస్తున్నారు. తెలంగా ణలోని పది జిల్లాల (హైదరాబాద్ మినహా)కు సంబంధించిన వారేగాక మహారాష్ర్టకు చెందిన పట్టు రైతులు కూడా ఈ రెండు కేంద్రాల్లోనే తమ పట్టుగూళ్లను విక్రయించుకుంటున్నారు. అధికారగ ణం సహకారం పుణ్యమాని జనగామ మార్కెట్లో ఇతర వ్యాపారులు పట్టుగూళ్లను కొనుగోలు చేయ డానికి వీలులేదు. మిగతా అన్ని మార్కెట్లలోనూ లెసైన్స్ గల ఏ వ్యాపాైరైనా వేలం ప్రాతిపదికన పట్టు గూళ్లను కొనుగోలు చేయవచ్చు.  ఈ పద్ధతి రైతుకు మేలు చేస్తోంది. కానీ జనగామలోని నోటిఫైడ్ మార్కెట్ ఏర్పాటుకు స్థలాన్ని ఇచ్చారనే ఒకే ఒక కారణంతో వరంగల్ కేంద్రంలోని ఇతర వ్యాపారు లను జనగామ మార్కెట్లో అడుగు మోపనీయడం లేదు. రైతుల పట్టుగూళ్లను కొనుగోలు చేయనివ్వ డం లేదు.

తెలంగాణలోని రైతులకు మార్కెట్ దూరాభా రాన్ని తగ్గించడం కోసం కోట్ల రూపాయల రాయితీ లను కల్పించి జనగామలో ఏర్పాటు చేసిన నోటి ఫైడ్ మార్కెట్ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో పట్ట్టు రైతుల పాలిట శాపంగా పరిణమించిం ది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లోని మార్కెట్లలో కిలో బైవోల్టెన్ పట్టుగూళ్ల ధర రూ. 450 పలికి సం దర్భాల్లోనూ జనగామలో రూ.300 దాటడం లేదంటే దోపిడీ తీవ్రతను అవగతం చేసుకోవచ్చు. ఇదేమిటని ప్రశ్నించిన రైతులను మరెక్కడయినా అమ్ముకోవాలని మార్కెట్‌ను శాసిస్తున్న వ్యాపారితో పాటు అధికారులు కూడా సూచిస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ధరల మాయాజాలంలో కేజీ పట్టుగూళ్లకు రైతు ప్రోత్సాహకంగా ప్రభుత్వం కల్పిస్తున్న రూ.50 మొత్తాన్ని ఈ మార్కెట్లో అప్ప నంగా కాజేస్తున్నారు. అంటే ప్రతి 40 రోజులకు పంట అమ్మకానికి ఈ మార్కెట్టుకు వెడుతున్న రైతు ప్రతి క్వింటా పట్టుగూళ్లకు సగటున రూ.5 వేలు, పంటకు 10 నుంచి 15 వేల రూపాయల మొత్తంలో దోపిడీకి గురవుతున్నాడు.

ఇది చాలదన్నట్లు రైతుకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాల అంశంలోనూ అధికారుల వైఖరి తీవ్ర ఆవేదనను కలిగిస్తోంది. చాకీ పట్టు పురుగు లను కొనుగోలు చేసిన రైతుకు రావలసిన రాయితీ డబ్బు మొత్తాన్ని ఇవ్వడంలో అధికారగణం దోబూ చులాడుతోంది. పంట విక్రయం జరిగి నెలలు గడుస్తున్నా ఈ డబ్బు మాత్రం రైతులకు  చేరలేదు. గడచిన ఏడాదిన్నరగా ప్రతి 100 పట్టుగుడ్లకు రూ.100 చొప్పున లభించాల్సిన రాయితీ డబ్బును కూడా ఇంతవరకు చెల్లించలేదు.  ఈ నేపథ్యంలో రెండున్నర దశాబ్దాల క్రితం రూపొందించిన రాయి తీలను పునఃసమీక్షించాల్సిన అవసరముంది. కిలో పట్టుగూళ్ల ప్రోత్సాహక మొత్తాన్ని రూ.50 నుంచి 100కు పెంచాలి. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మరో. రూ.50 ఇప్పించాలి. ఎప్పటినుంచో ప్రతిపాదనల్లోనే మూలుగుతున్న  మిగతా రాయితీలను అమలు చేయాలి. లేని పక్షంలో నేటి పత్తి, మిర్చి రైతుల బాటలోనే పట్టు రైతులు కూడా ప్రాణాలు తీసుకున్నా ఆశ్చర్యం లేదు. రైతు చచ్చాక  ఇచ్చే పరిహారం కన్నా చావకుండా తీసుకునే రాయితీ చర్యలు మిన్న అని ప్రభుత్వం భావిస్తే అంతకన్నా మేలు మరొకటి ఉండదు.
 పెద్ది పద్మ (వ్యాసకర్త పట్టు రైతు, ఉనికిచెర్ల, వరంగల్ జిల్లా)

Videos

అకాల వర్షం..అపార నష్టం

హైదరాబాద్ లో వర్ష బీభత్సం..సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ఇచ్చాపురం జనసంద్రం..

పార్టీ పెట్టి పదేళ్ళయింది..ఏం పీకావ్..పవన్ కి ముద్రగడ పంచ్

పేదల నోట్లో మట్టి కొట్టిన సైకో.. రైతులు, విద్యార్థులపై బాబు కుట్ర

"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?