amp pages | Sakshi

టీడీఎఫ్‌ ఆధ్వర్యంలో ఘనంగా వనభోజనాలు

Published on Tue, 08/14/2018 - 20:08

పోర్ట్‌ల్యాండ్‌ : అమెరికా తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరమ్‌(టీడీఎఫ్‌) పోర్ట్‌ల్యాండ్‌ చాప్టర్‌ ఆధ్వర్యంలో అట్టహాసంగా వజభోజనాల కార్యక్రమం జరిగింది. రుచికరమైన తెలుగు వంటకాలతో ఆట పాటలతో చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ కలిసి ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.  ఫ్రొఫెసర్‌ జయశంకర్‌కి చాప్టర్‌ చైర్మన్‌ శ్రీని అనుమాండ్ల నివాళులు అర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ వనభోజన కార్యక్రమానికి పోర్ట్‌ల్యాండ్‌ మెట్రో సిటీ నుంచి పెద్ద ఎత్తున ఎన్నారైలు తరలివచ్చారు. ఈ సందర్భంగా టీడీఫ్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ టీం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆటల్లో గెలుపొందిన వారికి బహుమతితో పాటు సర్టిఫికేట్‌ ఆఫ్‌ అవార్డ్స్‌ను చాప్టర్‌ చైర్మన్‌ అందించారు. అనంతరం పుడ్‌ కమిటీ తయారు చేసిన రుచికరమైన తెలుగు వంటకాలతో చిన్నా పెద్ద అంతా కలిసి భోజనం చేశారు. మహిళలు, పిల్లలు, యువకులు, యువదంపతులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించడానికి సహాయం చేసిన స్పాన్సర్‌ అందరికీ శ్రీని కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీఢీఎప్‌ చాప్టర్‌ టీం సభ్యులు నిరంజన్‌ కూర, నరెందర్‌ చీటి, రాజ్‌ అందోల్, కాంత్‌ కోడిదేటి, కొండల్‌రెడ్డి పుర్మ, మధుకర్‌రెడ్డి పురుమాండ్ల, జయాకర్‌ రెడ్డి ఆడ్ల,  హరి సూదిరెడ్డి, సత్య సింహరాజు, ఈవెంట్‌ టీం సభ్యులు శ్రీనివాసరెడ్డి పగిడి, వీరేష్‌ బుక్క, ప్రవీణ్‌ యలకంటి, స్పోర్ట్స్‌ టోర్నమెంట్‌ వాలంటీర్స్‌ శ్రీని బొంతల, అజయ్‌ అన్నమనేని, వెంకట్‌ ఇంజమ్‌ తదితరులు పాల్గొన్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌