amp pages | Sakshi

విదేశీ యువతిని వేధించిన క్యాబ్ డ్రైవర్

Published on Fri, 07/31/2015 - 10:58

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో క్యాబ్ డ్రైవర్ల ఆగడాలకు  అడ్డూ అదుపు లేకుండాపోతోంది.   విదేశాలనుంచి వచ్చిన టూరిస్ట్ మహిళలు, యువతులను కూడా వదలకుండా వేధింపులకు గురి చేస్తున్నారు. తాజాగా అమెరికా నుంచి వచ్చిన 20 ఏళ్ల యువతిని ఢిల్లీకి చెందిన క్యాబ్ కంపెనీ  డ్రైవర్  లైంగికంగా వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  జులై 24 న ఈ ఘటన జరిగితే, నాలుగు రోజులు మానసిక వేదన  తర్వాత ఫిర్యాదు చేయడానికి బాధితురాలు ముందుకొచ్చింది.   జూలై 28 తన స్నేహితుల సహాయంతో అహ్మద్ నగర్లో ఫిర్యాదు చేసింది.

అహ్మద్ నగర్లోని ఆధ్యాత్మిక కేంద్రాన్ని సందర్శించేందుకు ఆ యువతి అమెరికా నుంచి వచ్చింది. ఢిల్లీలోని చిత్తరంజన్ పార్క్ ప్రాంతంలోని ఓ హోటల్ లో జూలై 24న దిగి సమీప ప్రాంతాలను సందర్శించేందుకు ట్యాక్సీ అద్దెకు తీసుకుంది. మార్గ మధ్యంలో డ్రైవర్ ...ఆమెను బలాత్కరించడానికి ప్రయత్నించాడు. భయంతో ఆమె ఆ విషయాన్ని బయటకు చెప్పలేకపోయింది.

అనంతరం  తన పర్యటనలో భాగంగా  మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ వెళ్ళిపోయింది.  అక్కడికి చేరిన తరువాత జరిగిన  సంఘటనను  స్నేహితులతో పంచుకుంది.  దీంతో వారు అహ్మద్ నగర్ ఎస్పీని  కలిసి విషయాన్ని వివరించారు.  స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.  అక్కడ ఫిర్యాదును నమోదు చేసిన పోలీసులు, వేధింపుల ఘటన ఢిల్లీలో చోటు చేసుకోవడంతో కేసును ఢిల్లీకి  బదిలీ చేశారు.

అహ్మద్ నగర్ పోలీసుల వివరాలను స్వీకరించి  దర్యాప్తు చేపట్టామని ఢిల్లీ  డీసీపీ సింగ్ రాంన్ధ్వా వెల్లడించారు.  వేధింపులకు పాల్పడిన డ్రైవరును గుర్తించి  కేసు నమోదు చేశామన్నారు.  డ్రైవర్ దేవరాజ్ చౌహాన్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నగరంలో  క్యాబ్ ఆఫీసులపై తనిఖీలు నిర్వహిస్తున్నామని, నిఘా పెట్టామని వెల్లడించారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌