amp pages | Sakshi

రాజ్యసభలో ట్రిపుల్‌ రగడ

Published on Tue, 07/30/2019 - 12:30

న్యూఢిల్లీ: రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ భాగస్వామ్య పక్షం జేడీ(యూ) సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. బిల్లుపై చర్చను ప్రారంభించిన మంత్రి ఇస్లామిక్ దేశాలు సైతం త్రిపుల్ తలాక్ ను నిషేధించాయని గుర్తు చేశారు.చిన్న చిన్న కారణాలతో ట్రిపుల్ తలాక్ చెబుతున్న ఉదంతాలు సుప్రీంకోర్టు దృష్టికి వచ్చాయని తెలిపారు.బాధితురాలు, ఆమె రక్త సంబంధీకులకు మాత్రమే ట్రిపుల్ తలాక్ పై కేసు పెట్టే అధికారం ఇచ్చామని,ఈ బిల్లు మానవత్వానికి,  న్యాయానికి సంబంధించినది మాత్రమేనని, మతంతో ముడిపడి లేదని స్పష్టం చేశారు.

మహిళల అభ్యున్నతి కోసమే తమ ప్రభుత్వం ఈబిల్లు తీసుకొచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ఇక పెద్దల సభలో అధికార సభ్యుల కంటే విపక్ష సభ్యులు అధికంగా ఉండటంతో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును రాజ్యసభలో గట్టెక్కించడం మోదీ సర్కార్‌కు సవాల్‌గా మారింది. ప్రధాన విపక్ష పార్టీలన్నీ బిల్లును వ్యతిరేకిస్తుండటం ప్రభుత్వానికి మింగుడుపడటం లేదు.

లోక్‌సభలో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు ఓటింగ్‌కు వచ్చినప్పుడు కాంగ్రెస్‌, ఎస్పీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే సహా పలు విపక్ష పార్టీలు సభ నుంచి వాకౌట్‌ చేశాయి. బిజేపీ మిత్ర పక్షం జేడీ(యూ) సైతం ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. పార్లమెంట్‌ ఉభయసభల్లో ఆమోదం కంటే ముందు ఈ బిల్లును పరిశీలన కోసం సెలెక్ట్‌ కమిటీకి నివేదించాలని కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకేలు డిమాండ్‌ చేశాయి.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)