amp pages | Sakshi

ప్రపంచ సాహిత్యానికి తీసిపోనిది తెలుగు సాహిత్యం

Published on Tue, 02/13/2018 - 03:37

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు కవిత్వం, సాహిత్యం ప్రపంచంలోని మరే ఇతర సాహిత్యానికీ తీసిపోదని.. దానికి అత్యున్నత ప్రమాణాలు, నాణ్యత ఉన్నాయని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దేవిప్రియ అభిప్రాయపడ్డారు. ఆయన రచించిన ‘గాలిరంగు’ కవిత్వం.. 2017కుగానూ ఉత్తమ కవితా సంపుటి అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా పల్నాడులోని ఓబులేశునిపల్లెలో జన్మించిన దేవిప్రియ సినీరంగంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి జర్నలిజంలో స్థిరపడ్డారు. ‘అమ్మ చెట్టు’ మొదలుకొని ‘గాలిరంగు’ వరకు మొత్తం 7 కవితా సంపుటాలను రచించారు. 24 భాషల్లో పురస్కారాలకు ఎంపికైన రచయితలకు అవార్డుల ప్రదానోత్సవం సోమవారం ఢిల్లీలో జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ నూతన అధ్యక్షుడు కంబార్‌ చంద్రశేఖర్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 40 ఏళ్లుగా కొనసాగిన తన రచనా ప్రస్థానంలో తెలుగు నుంచి ‘గాలిరంగు’కు సాహిత్య అకాడమీ అవార్డు అందుకోవడం సంతోషాన్నిచ్చిందన్నారు. ప్రపంచంలోని ఏ సాహిత్య ప్రమాణాలతోనూ తీసిపోని తెలుగు సాహిత్యం.. ఇతర భాషల్లోకి అనువాదం కాకపోవడం పెద్ద లోపమని అభిప్రాయపడ్డారు. సాహిత్య అకాడమీపై ఉత్తరాది ప్రభావం ఉందన్న భావనను తెలుగు రచయితలు, కవులు వదులుకోవాలన్నారు.  తెలుగు సాహిత్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలూ చొరవ తీసుకోవాలని కోరారు. పాఠశాల స్థాయిలో తెలుగును తప్పనిసరి చేసిన సీఎం కేసీఆర్‌కు భాష, సాహిత్యంపై శ్రద్ధ ఉండడం అభినందనీయమన్నారు. తెలుగులో విద్యనభ్యసించే అవకాశాలను ప్రభుత్వాలు భవిష్యత్తు తరాలకు కల్పించాలని అన్నారు.  కాగా, ఉర్దూలో మొహమ్మద్‌ బేగ్‌ ఈ అవార్డును అందుకున్నారు. హైదరాబాద్‌ వర్సిటీలో ఆయన ఉర్దూ విభాగాధిపతిగా పనిచేసి రిటైరయ్యారు. చిన్న కథల విభాగంలో ఆయన రచించిన ‘దుఃఖమ’ అవార్డుకు ఎంపికైంది. పురస్కారాలు అందుకున్న రచయితలకు జ్ఞాపికతోపాటు రూ.లక్ష నగదు బహుమానాన్ని ప్రదానం చేశారు.

Videos

ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు

దొంగలు దొరికారు

రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్

హిందూపురానికి బాలకృష్ణ చేసిందేమీ లేదు.. అందుకే ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు

జగనన్న సంక్షేమమే నన్ను గెలిపిస్తుంది..175/175 పక్కా

సీఎం రమేష్ ను కలవడంపై కొమ్మినేని విశ్లేషణ

అప్పుడు కరెక్ట్.. ఇప్పుడు రాంగ్ ఎలా..బయటపడ్డ టీడీపీ కుట్ర

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..

Watch Live: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ

రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌