amp pages | Sakshi

ఆరోగ్యానికి ఆయుష్షు..

Published on Sat, 07/06/2019 - 03:58

న్యూఢిల్లీ: గత రెండు బడ్జెట్‌లతో పోల్చితే ఈసారి ఆరోగ్య రంగానికి కేంద్రం నిధులు గణనీయంగా పెంచింది. వైద్య విద్యను బలోపేతం చేసే దిశగా మెడికల్‌ కాలేజీలను నవీకరించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నిధులు కేటాయించారు. ఆరోగ్య రంగానికి బడ్జెట్‌లో రూ. 62,659.12 కోట్లు ప్రతిపాదించారు. 2018–19 బడ్జెట్‌ (రూ. 52,800 కోట్లు)తో  పోల్చితే 19 శాతం పెంచారు. కేంద్రం కీలకంగా భావిస్తున్న బీమా పథకమైన ఆయుష్‌మాన్‌ భారత్‌–ప్రధాన మంత్రి జన్‌ ఆరోగ్య యోజన (ఏబీ–పీఎంజేఏవై)కు రూ. 6,400 కోట్లు కేటాయించారు. పట్టణ ప్రాంతాల్లో ఆయుష్‌మాన్‌ భారత్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్స్‌ నెలకొల్పడానికి రూ. 249.96 కోట్లను కేటాయించారు. ఇక జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ కింద ఆ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి రూ. 1,349.97 కోట్లు ప్రతిపాదించారు. జాతీయ ఆరోగ్య మిషన్‌కు రూ. 32,995 కోట్లు కేటాయించారు. అయితే ఎన్‌హెచ్‌ఎం కార్యక్రమమైన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన (ఆర్‌ఎస్‌బీవై) పథకానికి భారీగా కోత పెట్టారు.

ఈసారి కేవలం రూ. 156 కోట్లు మాత్రమే కేటాయించారు. జాతీయ ఎయిడ్స్, ఎస్‌టీడీ నియంత్రణ కార్యక్రమానికి గతేడాది కంటే రూ. 400 కోట్లు పెంచి రూ. 2,500  కోట్లు కేటాయించారు. ఇక ఎయిమ్స్‌కు గత బడ్జెట్‌లో రూ. 3,018 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది రూ. 3,599.65 కోట్లకు పెంచారు. జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమానికి రూ. 40 కోట్లు, కేన్సర్, డయాబెటిస్, గుండె జబ్బుల నియంత్రణ కార్యక్రమానికి రూ. 175 కోట్లు కేటాయించారు. కార్పొరేట్‌ ఆస్పత్రులు, పెద్ద ఆస్పత్రుల్లో వైద్యానికి సంబంధించిన టెర్షియరీ కేర్‌ పోగ్రామ్‌లో రూ. 200 కోట్లు కోత పెట్టి రూ. 550 కోట్లు ప్రతిపాదించారు. నర్సింగ్‌ సర్వీసులకు రూ. 64 కోట్లు, ఫార్మసీ స్కూళ్లు, కాలేజీకు రూ. 5 కోట్లు, జిల్లా ఆస్పత్రులు, రాష్ట్ర ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు (పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ సీట్స్‌) అప్‌గ్రేడ్‌ చేయడానికి రూ. 800 కోట్లు, జిల్లా ఆస్పత్రులను కొత్త మెడికల్‌ కాలేజీలుగా మార్చడానికి రూ. 2,000 కోట్లు, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను (అండర్‌ గ్రాడ్యుయేట్‌), కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సంస్థలను బలోపేతం చేయడానికి రూ. 1,361 కోట్లు ప్రతిపాదించారు. 

సంప్రదాయ వైద్యానికి రూ. 1,939.76 కోట్లు 
సంప్రదాయ వైద్యాన్ని ప్రోత్సహించే దిశగా మోదీ ప్రభుత్వం ఆయుష్‌ మంత్రిత్వ శాఖకు సుమారు 15 శాతం అధికంగా నిధులిచ్చింది. ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునానీ, సిద్ధ, హోమియోపతి (ఆయుష్‌) వైద్యానికి సంబంధించి రూ. 1,939.76 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. ఆయుష్‌ నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయడానికి రూ. 92.31 కోట్లు ప్రతిపాదించారు. ఇక అటానమస్‌ సంస్థలైన సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేద, సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ హోమియోపతి, సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ యునానీ వైద్యానికి సంబంధించి వరుసగా.. రూ. 292.31 కోట్లు, రూ. 118.53 కోట్లు, రూ. 152.65 కోట్లు కేటాయించారు.  

ఈ బడ్జెట్‌లో ఆరోగ్య రంగం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. ఆరోగ్య రంగాన్ని పటిష్టం చేయాలంటే రాబోయే ఐదేళ్లలో ఈ రంగంలో రూ.100 లక్షల కోట్లను కేంద్రం వెచ్చించాల్సి ఉంటుంది. విదేశీ బీమా మధ్యవర్తిత్వ సంస్థల్లో 100 శాతం ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) వల్ల భారత ఆరోగ్య రంగానికి పరోక్షంగా లబ్ధిచేకూరుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈసారి ప్రగతిశీల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.
- గౌతమ్‌ ఖన్నా సీఈవో హిందుజా ఆసుపత్రి–ఎంఆర్‌సీ

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)