amp pages | Sakshi

ప్రజా భాగస్వామ్యంతోనే దేశాభివృద్ధి

Published on Sun, 04/22/2018 - 02:52

న్యూఢిల్లీ: ప్రజల భాగస్వామ్యం ఉంటేనే దేశాభివృద్ధి సాధ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రభుత్వ పథకాల అమల్లో అధునాతన సాంకేతికత, సృజనను వినియోగించుకోవాలని ప్రభుత్వ అధికారులకు పిలుపునిచ్చారు. శనివారం ముగిసిన రెండ్రోజుల సివిల్‌ సర్వీసెస్‌ డే కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. పరిపాలనలో నిర్ణయాలు తీసుకోవడం, ఫైళ్లను ముందుకు కదిలించడంలో నెలకొన్న జాప్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.‘నాలుగు పుణ్య క్షేత్రాలు సందర్శిస్తే మనిషికి మోక్షం లభిస్తుంది. కానీ ఒక ఫైల్‌ అలాంటి యాత్రలు 32 చేసినా ఫలితం ఉండట్లేదు’ అని మోదీ అన్నారు. కొత్త విధానాలు, చట్టాలు చేసే సమయంలో ప్రజా ప్రయోజనాలకే పెద్దపీట వేయాలని అన్నారు.

ప్రభుత్వ విధానాల అమలులో వ్యూహాత్మకంగా ఆలోచించాలని, ఉన్నతాధికారులు సాంకేతికతను వినియోగించుకుంటే అది వారికి అదనపు బలమవుతుందని అన్నారు. సివిల్‌ అధికారుల శక్తి, సామర్థ్యాలు గొప్పవని, అవి జాతి ప్రయోజనాలకు ఎంతో దోహదపడుతాయని పేర్కొన్నారు. వెనకబడిన జిల్లాల అభివృద్ధికి వ్యూహాలు, ప్రాధమ్య కార్యక్రమాలతో కూడిన రెండు పుస్తకాలను మోదీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల అమల్లో ఉత్తమ పనితీరు కనబరచిన జిల్లాల అధికారులు, కేంద్ర, రాష్ట్రాల సంస్థలకు అవార్డులు అందజేశారు. మణిపూర్‌లోని కరంగ్‌ని దేశంలోనే తొలి నగదు రహిత దీవిగా తీర్చిదిద్దిన అధికారులకు మోదీ అవార్డును బహూకరించారు.

Videos

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు

దొంగలు దొరికారు

రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్

హిందూపురానికి బాలకృష్ణ చేసిందేమీ లేదు.. అందుకే ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు

జగనన్న సంక్షేమమే నన్ను గెలిపిస్తుంది..175/175 పక్కా

సీఎం రమేష్ ను కలవడంపై కొమ్మినేని విశ్లేషణ

అప్పుడు కరెక్ట్.. ఇప్పుడు రాంగ్ ఎలా..బయటపడ్డ టీడీపీ కుట్ర

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌