'ఆయన అలా అన్నారంటే.. ఏదో బాధపెట్టే ఉంటుంది'

Published on Wed, 11/25/2015 - 13:05

లక్నో: భారత్లో అసహన పరిస్థితులు ఉన్నాయంటూ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యల విషయంలో సమాజ్ వాది పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ కాస్త సానుకూలంగా స్పందించారు. ఏదో విషయం ఆయనను బాధపెట్టి ఉంటుందని, అందుకే అమీర్ చెప్పి ఉంటారని అన్నారు. ఈ దేశంలో ఎవరికి ఏమనిపించినా చెప్పే హక్కు ఉందని చెప్పారు.

అమీర్ ఖాన్ ఓ పెద్ద నటుడని, కేంద్రప్రభుత్వం ఆయనతో ఒకసారి మాట్లాడి అసలు విషయం అడిగి తెలుసుకొని అర్థం చేసుకుంటే మంచిదని, ఆయన ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని కోరారు. దేశంలో ఆరు నెలలుగా అభద్రతా పరిస్థితులు నెలకొన్నాయని, తమ పిల్లల విషయంలో తన భార్య కిరణ్ ఆందోళన చెందుతోందని, దేశం వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్లాలని కూడా ఆలోచించిందని అమీర్‌ ఖాన్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు పెను ధుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే ఆయా పార్టీకు చెందిన అగ్ర నేతలతో పాటు కొందరు సెలబ్రిటీలు కూడా స్పందించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ