amp pages | Sakshi

కవర్‌పై ఓ పేరు.. లోపల చూస్తే..

Published on Sun, 06/14/2020 - 14:01

కోల్‌కతా : ఆన్‌లైన్‌ స్టోర్‌లలో ఆర్డర్‌ చేసిన వస్తువు కాకుండా మరో వస్తువు వచ్చిన ఘటనలు కోకొల్లలు. ఫోన్‌ ఆర్డర్‌ చేస్తే ట్రిమ్మర్‌, స్కిన్ లోష‌న్ ఆర్డ‌ర్ చేస్తే ఖరీదైన ఇయర్‌ బర్డ్స్‌ ఇలా ఎన్నో వస్తువులు. కొన్ని కోపం, చిరాకు తెప్పిస్తే మరొకొన్ని నవ్వు తెప్పిస్తాయి. తాజాగా నవ్వు తెప్పించే సంఘటనే ఒకటి పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకుంది. కోల్‌కతాకు చెందిన సుతీర్థ దాస్‌ బుధవారం ఆన్‌లైన్‌ స్టోర్‌ అమెజాన్‌లో కమ్యూనిస్టు మేనిఫెస్టో ఆర్డర్‌ చేశాడు. ఆర్డర్‌ కన్ఫర్మేషన్‌, డెలివరీ రోజు అతడికి మెసెజ్‌ రూపంలో అందాయి. శనివారం 11గంటల సమయంలో అతడికి ఓ మహిళనుంచి ఫోన్‌ వచ్చింది.(హుర్రే: ఆర్డ‌ర్ చేసిందొక‌టి.. వ‌చ్చింది మరొక‌టి)

కమ్యూనిస్టు బుక్‌ కాకుండా వేరే బుక్‌ డెలివరీ అవ్వబోతోందని, డెలివరీ క్యాన్సిల్‌ చేయాలని ఆమె సుతీర్థకు చెప్పింది. అతడు ఆఫీసులో ఉన్న కారణంగా బుకింగ్‌ క్యాన్సిల్‌ చేయలేకపోయాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత పార్శిల్‌ విప్పి చూసి ఆశ్చర్యపోయాడు. దాని కవర్‌ మీద కమ్యూనిస్టు మేనిఫెస్టో అని రాసి ఉన్నా.. లోపల మాత్రం భగవద్గీత ఉంది. అతడు తన ఆన్‌లైన్‌ ఆర్డర్‌ అనుభవాలను ఫేస్‌బుక్‌ ఖాతాలో షేర్‌ చేశాడు. దీంతో ఈ న్యూస్‌ కాస్తా వైరల్‌గా మారింది.

Videos

అమెరికాలో ప్రమాదంలో ప్రాణాలు విడిచిన తెలంగాణ యువకుడు

చంద్రబాబుకి బయపడి గుళ్లలో తలా దాచుకుంటున్నారు..

తాడిపత్రి హింసాత్మక ఘటనల వెనుక అసలు హస్తం

కుప్పం నుండి ఇచ్చాపురం వరకు అందుకే పోలింగ్ శాతం పెరిగింది

పోలీసులు ఏ రాజకీయ పార్టీల ప్రలోభాలకు లోను కాకుండా నిస్పక్షపాతంగా పనిచెయ్యాలి

ఏపీ ఎన్నికల అల్లర్ల పై సిట్ విచారణ.. ఇప్పటికే పోలీసుల ఫై వేటు

మోడీపై పోటీ చేస్తున్న శ్యామ్ కు షాక్..

మాట నిలబెట్టుకునే మా అన్నకు మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి

అచ్చెన్నాయుడు రిగ్గింగ్.. అడ్డుకున్న వారిపై దాడి

ప్రేమ పేరుతో యువకుడిని మోసం చేసిన యువతి

Photos

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)