amp pages | Sakshi

తీహార్ జైలుకు కార్తీ

Published on Mon, 03/12/2018 - 18:49

సాక్షి,న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం కుమారుడు, కార్తీ చిదంబరాన్ని తీహార్‌ జైలుకు తరలించారు.   ఈ నెల 24తేదీవరకు కార్తీని  జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించాలని ప్రత్యేక న్యాయస్థానం సోమవారం ఆదేశాలు జారీ చేసింది.  మూడు-రోజుల పోలీసు కస్టడీ గడువు ముగిసిన తర్వాత మరో15 రోజుల కస్టడీ కోరిన సీబీఐ ప్రతిపాదనకు కోర్టు నో చెప్పింది.  అంతేకాదు కార్తీ ముందస్తు  బెయిల్‌ పీటిషన్‌ను తోసిపుచ్చింది.   జైలులో ఇంటి భోజనానికి అవకాశం ఇవ్వలేమని కూడా  కోర్టు తేల్చి చెప్పింది. మార్చి 15కార్తీ బెయిల్‌ పీటిషన్‌ను విచారించనున్నట్టు తెలిపింది.

అయితే భద్రతాకారణాల రీత్యా తనకు ప్రత్యేక సెల్‌ కేటాయించాలని కార్తీ అభ్యర్థించారు. 1995 లో బిస్కట్ బారన్ రాజన్ పిళ్ళై మరణించిన ఉదంతాన్ని గుర్తు చేసిన కార్తీ చిదంబరం తాను అలా కావాలని కోరుకోవడం లేదని  పేర్కొన్నారు. తనకు ఏమైనా జరగవచ్చు అనే సందేహాలను వ్యక్తం చేశారు.  ఈ నేపథ్యంలో తనకు ప్రత్యేకగది,  బాత్‌ రూం కావాలని కార్తీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతోపాటు ఇంటిలో వండిన ఆహారం, మందులు, కళ్లజోడు లాంటి కావాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.  దేశ  ఆర్థికమంత్రిగా తన తండ్రి చిదంరబం పనిచేసిన సమయంలో​ ఉగ్రవాద కేసులను నిర్వహించారని ఆయన వాదించారు. అయితే  మందులు, కళ్లజోడుకు అంగీకారం తెలిపిన  కోర్టు మిగిలినవాటిని తోసి పుచ్చింది. ఆయన భద్రతకు ఢోకాలేదని చెప్పింది. ఈ సమయంలో మాజీ కేంద్రమంత్రి చిదంబరం కూడా కోర్టులో ఉన్నారు.

కాగా యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి కేంద్ర ఆర్థికమంత్రిగా పని చేసిన చిదంబరం అధికారం అడ్డంపెట్టుకుని  అక్రమాలకు పాల్పడ్డారని, ఐఎన్ఎక్స్ మీడియాకు  విదేశీ నిధుల కోసం కుమారుడు కార్తీకి లాభం చేకూరేలా వ్యవహరించారని సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. తాజాగా ఇంద్రాణీ ముఖర్జీ  వాంగ్మూలం  నేపథ్యంలో  ఫిబ్రవరి 28 న చెన్నై విమానాశ్రయంలో కార్తీని  అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Videos

ఏలూరులో చల్లారని రగడ...

బస్సు ప్రమాదం జరగటానికి అసలు కారణాలు

చంద్రబాబు ఎత్తులు ఫలించాయా !..సక్సెస్ రేట్ ఎంత..?

ఉప్పెనలా ఏపీలో ఓటింగ్.. రాబోయేది 'ఫ్యాన్' టాస్టిక్ రిజల్ట్స్

తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్..!

పల్నాడులో టీడీపీ విధ్వంసకాండ

ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన

టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్

టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్

టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫైర్

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)