amp pages | Sakshi

ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి పెద్దపీట

Published on Thu, 12/07/2017 - 04:48

సాక్షి, బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం కాలుష్య నియంత్రణతో పాటు సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించింది. వినూత్న ఆఫర్లను ప్రకటిస్తూ పెట్టుబడులను ఆకర్షించడమే కాక మానవ వనరుల అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా ప్రత్యేక పాలసీని రూపొందించగా, ఇది త్వరలోనే అమల్లోకి రాబోతోంది. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి ముందుకొచ్చే సంస్థలకు ఐదేళ్ల పాటు ట్యాక్స్‌ హాలిడేను ప్రకటించనుంది. ల్యాండ్‌ కన్వర్షన్‌ ఫీజు మొత్తాన్ని (100 శాతం) రీయింబర్స్‌ చేయడంతోపాటు స్టాంప్‌ డ్యూటీ మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది. అలాగే ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ యూనిట్‌ ఏర్పాటుకు అయ్యే మొత్తంలో 50 శాతాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరించనుంది. ఈ వాహనాల టెస్టింగ్‌ ట్రాక్‌ను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో ప్రభుత్వమే నిర్మించనుంది.

వాహనాల చార్జింగ్‌ పాయింట్లకు అవసరమైన స్థలాన్ని స్థానిక సంస్థలే సమకూర్చనున్నాయి. ఇక కేవలం ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి ముందుకొచ్చే పెట్టుబడిదారులకే కాకుండా ఆ వాహనాలు వినియోగించే వారికి (నాన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలు) కూడా అనేక రాయితీలకు ప్రభుత్వం కల్పించనుంది. ముఖ్యంగా రోడ్, రిజిస్ట్రేషన్‌ చార్జీలను రద్దు చేయనుంది. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి సంబంధించిన కోర్సులు (డిప్లొమో నుంచి పీహెచ్‌డీ వరకూ) చదివే విద్యార్థుల ఫీజుల్లో 50 శాతం వరకూ రీయింబర్స్‌ చేయనుంది. దీని వల్ల ఎక్కువ మంది ఈ కోర్సులు చదవడానికి ముందుకు వస్తారని, తద్వారా పరిశ్రమకు అవసరమైన మానవ వనరులను రాష్ట్రం నుంచే అందించడానికి వీలవుతుందనేది ప్రభుత్వ భావిస్తోంది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌