బోడోల మారణకాండపై ఎన్‌ఐఏ దర్యాప్తు

Published on Sun, 12/28/2014 - 03:18

  • అస్సాంలో పర్యటించిన ఆర్మీ చీఫ్ దల్బీర్‌సింగ్ సుహాగ్
  • క్షేత్రస్థాయిలో పరిస్థితిపై అధికారులతో సమీక్ష
  • కార్యాచరణను మరింత ఉధృతం చేయాలని ఆదేశం
  • మరిన్ని బలగాలను మోహరిస్తామని వెల్లడి
  • గువాహటి: అస్సాంలో ఆదివాసీలపై బోడో తీవ్రవాదులు విచ్చలవిడిగా విరుచుకుపడి 81 మందిని బలిగొన్న మారణకాండపై దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించింది. ఈ మేరకు సోనిత్‌పూర్, కోక్రాఝర్ జిల్లాల పరిధిలో స్థానిక పోలీసులు నమోదు చేసిన నాలుగు కేసులను ఎన్‌ఐఏ తన ఆధీనంలోకి తీసుకోనుంది. మరోవైపు ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్ శనివారం అస్సాంలో పర్యటించారు.

    బాధిత ప్రాంతాల్లో చేపట్టిన చర్యలు, ప్రస్తుతమున్న బలగాల సంఖ్య, మరిన్ని అదనపు బలగాలను మోహరించే తదితర అంశాలపై స్థానిక పోలీసులు, ఆర్మీ అధికారులతో సమీక్షించారు. ప్రజలకు రక్షణ అందించడంతో పాటు తీవ్రవాదుల కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని.. ఇందుకోసం అవసరమైతే మరిన్ని బలగాలను పంపిస్తామని సూచించారు. బాధిత ప్రాంతాల్లో శాంతి తిరిగి నెలకొల్పేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో, నిఘా సంస్థలతో సమన్వయం చేసుకోవాలని, సాధ్యమైనంత సహకారం అందించాలని ఆర్మీ అధికారులకు సూచించారు. తర్వాత బాధిత ప్రాంతాలపై ఏరియల్ సర్వే చేసిన ఆర్మీ చీఫ్ దల్బీర్‌సింగ్ సుహాగ్... అనంతరం ఢిల్లీకి తిరిగివెళ్లారు.
     
    దర్యాప్తు ప్రారంభించనున్న ఎన్‌ఐఏ..

    అస్సాం-అరుణాచల్‌ప్రదేశ్‌ల సరిహద్దులోని సోనిత్‌పూర్, కోక్రాఝర్ జిల్లాల్లో ఆదివాసీలపై బోడో తీవ్రవాదుల మారణకాండపై దర్యాప్తును కేంద్ర హోంశాఖ ఎన్‌ఐఏకు అప్పగించింది. ఈ ఘటనపై ఎన్‌ఐఏ దర్యాప్తునకు ఆదేశించాలని అస్సాం చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.  ఈ మేరకు ఘటనపై పోలీసులు నమోదు చేసిన నాలుగు కేసులను ఎన్‌ఐఏ తన అధీనంలోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించనుంది. మరోవైపు బోడో తీవ్రవాదుల దుశ్చర్యకు నిరసనగా ఆదివాసీ వికాస్ పరిషత్ ఇచ్చిన బంద్ పిలుపుతో అస్సాంతో పాటు బెంగాల్ ఉత్తర ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది.
     

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)