amp pages | Sakshi

ఉరి రద్దు చేయూల్సిందే!

Published on Sat, 11/01/2014 - 03:31

తమిళనాడు- శ్రీలంకల మధ్య అనాదిగా సాగుతున్న విద్వేషాలు జాలర్లకు ఉరిశిక్ష ఉదంతంతో మరింతగా రాజుకున్నాయి. జాలర్ల కుటుంబాలకే పరిమితమై ఉన్న వివాదం రాష్ట్ర ప్రజానీకానికి పాకడం ద్వారా తీవ్ర ఆందోళనకు దారితీసింది.
 
 చెన్నై, సాక్షి ప్రతినిధి: శ్రీలంకకు అక్రమంగా హెరాయిన్‌ను తరలిస్తున్నారనే అభియోగంపై తమిళనాడుకు చెందిన అగస్టిన్, ఎమర్సన్, విల్సన్, ప్రశాంత్, లాంగైట్ అనే ఐదు గురి జాలర్లకు అక్కడి కోర్టు ఉరిశిక్ష విధిస్తూ గురువారం తీర్పు చెప్పింది. దీంతో గురువారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు రామనాథపు రం జిల్లాలో ఆందోళనలు నిర్వహించారు. బస్సుల ధ్వంసం, దహనం, రైలుపట్టాల ధ్వంసం, రాస్తారోకో వంటి ఆందోళనలతో అట్టుడికి పోయింది. శ్రీలంక దుందుడుకు తనాన్ని రాజకీయ పార్టీలన్నీ ముక్తకంఠంతో ఖండించారుు. రాష ్టవ్య్రాప్తంగా శుక్రవారం కూడా నిరసనలు పెల్లుబికారుు.
 
 రాయబార కార్యాలయ ముట్టడికి యత్నం
 తమిళ జాలర్ల పట్ల శ్రీలంక వైఖరిని నిరసిస్తూ తమిళాభిమాన సమాఖ్య నేతలు శుక్రవారం చెన్నైలోని శ్రీలంక రాయబార కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. వివిధ సంఘాలకు చెందిన వందలాది మంది నాయకులు నినాదాలు చేస్తూ రాయబార కార్యాలయం వద్దకు బయల్దేరారు. అయితే అప్పటికే బారికేడ్లతో అప్రమత్తంగా ఉన్న పోలీసులు వారిని మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే దిష్టిబొమ్మను కాళ్లతో తన్నుతూ దగ్ధం చేయగా 300 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మద్రాసు హైకోర్టు న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. ఉరిశిక్షకు గురైన వారి విడుదల కోసం భారత ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, కచ్చదీవులను స్వాధీనం చేసుకోవాలని, తమిళ జాలర్లపై కాల్పులు జరిపిన శ్రీలంక గస్తీదళాలను అరెస్ట్ చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగడంతో 13 సముద్రతీర జిల్లాల్లో పోలీసులు బందోబస్తును పెంచారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 24 గంటలు గస్తీపెట్టారు. చెన్నైలోని శ్రీలంక రాయబార కార్యాలయం, శ్రీలంక ఎయిర్‌లైన్స్ వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. శనివారం నగరంలో ఆందోళన చేపట్టనున్నట్లు క్రైస్తవ సంఘాలు ప్రకటించాయి.
 
 చేపల వేట బహిష్కరణ
  జాలర్లకు ఉరిశిక్ష పై తమిళనాడులోని వివిధ మత్స్యకార సంక్షేమ సంఘాలు అత్యవసరంగా సమావేశమయ్యూరుు. జాలర్లపై అక్రమంగా నమోదు చేసిన కేసులను కొట్టివేసి విడుదల చేసే వరకు చేపలవేటకు వెళ్లరాదని తీర్మానించాయి. దీంతో రామేశ్వరంలోని 1500 పడవలు ఒడ్డునే మిగిలిపోగా, సుమారు 10 వేల మంది జాలర్లు నిరసన పాటించారు. అమాయకులైన తమ భర్తలను నిర్దోషులుగా విడుదల చేయకుంటే మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకుంటామని ఉరిశిక్ష పడిన జాలర్ల భార్యలు ప్రకటించారు.
 
 దెబ్బకు దెబ్బ
 హెరాయిన్ కేసును అడ్డుపెట్టుకుని ఐదుగురి తమిళ జాలర్లకు ఉరిశిక్షకు నిర్ణయించారో, అదే హెరాయిన్ శ్రీలంక మెడకు చుట్టుకోనుంది. వంద మంది శ్రీలంకవాసులు హెరాయిన్ తరలిస్తుండగా తమిళనాడు పోలీసులు మూడేళ్ల క్రితం పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ కేసులు రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో నడుస్తున్నాయి. అయితే ఈ వ్యవహారం నిన్నటి వరకు సాధారణ క్రిమినల్ కేసుల కిందకే వచ్చింది. అయితే ఇదే నేరంపై శ్రీలంక ఉరిశిక్షకు సిద్ధం కావడంతో తమిళులు కూడా అదే శిక్ష పడుతుందని భావిస్తున్నారు. శ్రీలంక నిందితులపై నేరం రుజువైతే 10 నుంచి 20 ఏళ్ల వరకు జైలుశిక్ష లేదా మరణశిక్ష పడేఅవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.
 

Videos

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!

Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్

ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్

అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..

నరసాపురం జనసంద్రం

రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ఉన్నారు: నాగార్జున యాదవ్

చంద్రబాబుపై ఫైర్

Photos

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)