amp pages | Sakshi

తొమ్మిదో షెడ్యూల్‌లోకి ఎస్సీ, ఎస్టీ చట్టం!

Published on Mon, 05/14/2018 - 04:59

న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టానికి రాజ్యాంగరక్షణ కల్పిస్తూ దీనిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేసేలా చేయాలని  కేంద్రం యోచిస్తోంది. ఈ చట్టాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చడం ద్వారా న్యాయస్థానాల సమీక్షకు వీలు లేకుండా చేయాలని భావిస్తోంది. అయితే, దీనికి ముందుగా ఒక ఆర్డినెన్స్‌ కూడా జారీ చేయనుంది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద సత్వర అరెస్టులను నిరోధిస్తూ మార్చిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో దేశ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే వచ్చే వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో ఎస్సీ,ఎస్టీ చట్టాన్ని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలనే అంశంపై బిల్లు ప్రవేశపెట్టనుంది. తొమ్మిదో షెడ్యూల్‌లోని అంశాలపై సుప్రీంకోర్టు సహా న్యాయస్థానాలు జోక్యం చేసుకునేందుకు వీలుండదు. దీనికంటే ముందుగా ఆర్డినెన్స్‌ తేనుందని సమాచారం. తీర్పును సమీక్షించాలన్న ప్రభుత్వ పిటిషన్‌ ఈ నెల 16వ తేదీన విచారణకు రానుంది. సుప్రీం తీర్పు మేరకు తదుపరి చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)