amp pages | Sakshi

సవతి తల్లి అమ్మేసింది.. ఎమ్మెల్యే కన్నేశాడు!

Published on Fri, 05/06/2016 - 04:35

గోవా ఎమ్మెల్యే మాన్‌సెరాట్, సవతి తల్లి అరెస్ట్
* సవతి తల్లి రూ. 50 లక్షలకు తనను అమ్మేసిందన్న బాలిక
* ఎమ్మెల్యే మత్తుమందు ఇచ్చి పలుమార్లు రేప్ చేసినట్లు ఆరోపణ

పణజి: మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గోవా బహిష్కృత కాంగ్రెస్ ఎమ్మెల్యే అటనాసియో మాన్‌సెరాట్‌ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన మార్చిలో 16ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణల మేరకు గోవా పోలీసులు బుధవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

రాష్ట్ర మాజీ విద్యాశాఖ మంత్రి కూడా అయిన మాన్‌సెరాట్ గతంలోనూ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, తన సవతి తల్లి రూ. 50 లక్షలకు తనను ఎమ్మెల్యేకు అమ్మేసిందని 16 ఏళ్ల బాధితురాలు గురువారం పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఆరోపించింది. ఎమ్మెల్యే తనను నిర్బంధించి మత్తు మందు ఇచ్చి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొంది. బాధితురాలికి గోవా మెడికల్ కాలేజీలో  నిర్వహించిన వైద్య పరీక్షల్లో అత్యాచారం  జరిగినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. అత్యాచారం, అక్రమ నిర్బంధం, విషప్రయోగం, మనుషుల అక్రమ రవాణా నేరారోపణలతో పలు చట్టాల కింద కేసు నమోదు చేశారు.

బాలిక సవతి తల్లిపైనా మనుషుల అక్రమ రవాణా తదితర చట్టాల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ‘నేనేతప్పూ చేయలేదు. నన్ను ఇరికించటం కోసమే చేశారు. ఆమె నా షోరూమ్ హాల్‌మార్క్‌లో పనిచేస్తుండేది. కానీ ఆమె దొంగతనం చేస్తూ పట్టుబడ్డాక పనిలోనుంచి తొలగించాను. ఇదంతా రాజకీయం. నేను దాక్కోవట్లేదు. లొంగిపోవటానికి వచ్చా’’ అని మాన్ సెరాట్ పేర్కొన్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌