amp pages | Sakshi

రైల్వే స్టేషన్ల ప్లాట్‌ఫారాల ఎత్తు పెంపు

Published on Mon, 09/01/2014 - 23:45

- రైల్వే అధికారుల కసరత్తు
- 9వ తేదీ నుంచి టెండర్ల ప్రక్రియ షురూ
- రూ.95.63 కోట్ల అంచనా వ్యయంతో పనులు
సాక్షి, ముంబై: లోకల్ రైల్వే ప్రయాణికుల భద్రతకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా నగరంతోపాటు శివారులోని మొత్తం 31 లోకల్ రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫారాల ఎత్తు పెంచేందుకు నిర్ణయం తీసుకొంది. ఈ నెల 9వ తేదీ నుంచి టెండర్లను ఆహ్వానించే ప్రక్రియ ప్రారంభించనున్నట్లు రైల్వే పరిపాలన విభాగం తెలిపింది. 2015 జనవరి వరకూ ఈ పనులు పూర్తిచే యాలని నిబంధనలు విధించనున్నట్లు తెలిపింది. ఈ పనుల కోసం రూ.95.63 కోట్ల అంచనా వ్యయాన్ని ప్రకటించింది. ఈ పనులు పూర్తికాగానే రెండో విడతలో మరో 46 ప్లాట్‌పారాల ఎత్తు పెంచేందుకు టెండర్ల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
 
ప్రమాదాలకు నెలవుగా

నగరం, శివారు ప్రాంతాల్లోని పలు లోకల్ రైల్వే స్టేషన్లలో ఫ్లాట్‌ఫాంలు ఎత్తు తక్కువగా ఉండి ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. దీనికి తోడు ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టిన రైళ్లు భారీఎత్తులో ఉన్నాయి. ప్రయాణికులు రైలు దిగాలన్నా, ఎక్కాలన్నా తీవ్ర అసౌకర్యానికి గురికావల్సి వస్తోంది. మహిళలు, వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికులు అదుపుతప్పి రైలు, ప్లాట్‌ఫాం మధ్యలో ఏర్పడిన ఖాళీ స్థలంలో పడి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు ఉన్నాయి.

మరికొందరు గాయాలపాలై వికలాంగులుగా మారారు. ఇలాంటి సంఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ విషయమై ప్రయాణికుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయమై బీజేపీ ఎంపీ కిరీట్ సోమయ్య పలుమార్లు రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు రైల్వే పరిపాలన విభాగం కళ్లు తెరిచింది. చివరకు టెండర్లను ఆహ్వానించాలని నిర్ణయం తీసుకుంది. రైల్వే ఫ్లాట్‌ఫాంల్లో ప్రయాణికుల ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం దోహదపడుతోందని అధికారులు భావిస్తున్నారు.
 
ఎత్తు పెంచే ఫ్లాట్‌ఫాంలు ఇవే..
విక్రోలి, విద్యావిహార్, దాదర్, సైన్, కుర్లా, కాంజూర్‌మార్గ్, శ్యాండ్రస్ట్‌రోడ్, రే రోడ్, మసీద్ బందర్, కాటన్ గ్రీన్, వడాల రోడ్, అంబర్‌నాథ్, బీవ్‌పూరి, డోంబివలి, ఆట్గావ్, ఖర్డీ, కసారా, భైకళ, మాటుంగా, ఉల్లాస్‌నగర్, సాన్‌పాడ, జుయినగర్, బెలాపూర్, నేరుల్, డాక్‌యార్డ్ రోడ్ తదితర స్టేషన్లలో ప్లాట్‌ఫాంలు చాలా తక్కువ ఎత్తులో ఉన్నాయి. వీటితోపాటు ఇంకా పలు రైల్వే స్టేషన్లలోని ఫ్లాట్ ఫాంల ఎత్తు పెంచాలని నిర్ణయించారు.

#

Tags

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)