amp pages | Sakshi

ఘనంగా భాయ్ దూజ్

Published on Sat, 10/25/2014 - 22:30

దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో పిలిచే భాయ్‌దూజ్ పండుగను నగరవాసులు ఆనందంగా జరుపుకున్నారు. ఈ పండుగ సందర్భంగా తమ నివాసానికి వచ్చిన అన్నయ్యలకు చెల్లెళ్లు, అక్కలు వారికి ఇష్టమైన వంటకాలు చేసి ఆతిథ్యమిచ్చారు. ఇక సోదరులు తమవంతుగా వారికి కానుకలను అందజేశారు.
 
 న్యూఢిల్లీ: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన భాయ్‌దూజ్ పండుగను నగరవాసులు ఘనంగా జరుపుకున్నారు. ఐదురోజులపాటు జరిగే దీపావళి పండుగ చివరిరోజున జరుపుకునే ఈ పండుగ సందర్భంగా చెల్లెళ్లు తమ సోదరుల ముఖాలపై సింధూరం రాసి కలకాలం ఆనందంగా జీవించాలంటూ ప్రార్థిస్తారు. ఇందుకు బదులుగా అన్నలు తమ చెల్లెళ్లకు కానుకలను అందజేస్తారు. అనంతరం వారికి ఆతిథ్యమిస్తారు. పసందైన భోజనం పెడతారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల పేర్లతో ఈ పండుగను పిలుస్తారు. భాయ్ టికా, భాయ్ ఫోటా, భాయ్ భీజ్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఎన్నో ఏళ్ల తర్వాత చేసుకున్నా: భాయ్‌దూజ్ పండుగను ఎన్నో ఏళ్ల తర్వాత చేసుకున్నానని నగరంలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతానికి చెందిన ప్రియదర్శినీసింగ్ సంతోషం వ్యక్తం చేసింది. ‘నా సోదరుడు కెనడాలో నివసిస్తున్నాడు. ఈ ఏడాది ఈ పండుగకు వచ్చాడు. వస్తూ వస్తూ నాకోసం అనేక కానుకలు కొనుగోలు చేశాడు. నాకు ఎంతో సంతోషంగా ఉంది’ అని అంది.
 
 మా అన్నయ్యకు ఖీర్ తినిపించా: ఈ పండుగ కోసం ప్రతిరోజూ కంటే ముందుగానే మేలుకున్నా. అన్నయ్యకి ఖీర్ అంటే ఎంతో ఇష్టం. అందుకని అదే చేసి తినిపించా’అని నగరానికి చెందిన మరో యువతి స్వేచ్ఛాశర్మ ఆనందంగా తెలిపింది. ఎన్నో పురాణ గాధలు: కాగా భాయ్‌దూజ్ పండుగకు సంబంధించి అనేక పురాణ గాధలు ఉన్నాయి. అందులో ఓ కథను ముందుగా చెప్పుకుందాం. యముడు ఓ రోజు తన సోదరి నివాసానికి వెళతాడు. అన్నయ్య రాకను గమనించి మురిసిపోయిన సోదరి అతని నుదుట సింధూరం దిద్దుతుంది. అంతేకాకుండా అన్నయ్య కలకాలం జీవించాలంటూ ప్రార్థనలు చేస్తుంది. ఇప్పుడు మరో కథకు వద్దాం. నరకాసురుడిని చంపిన అనంతరం శ్రీకృష్ణుడు తన సోదరి సుభద్ర ఇంటికి శ్రీకృష్ణుడు వెళతాడు. సుభద్ర తన అన ్నయ్య నుదుటిన సింధూరం దిద్ది ఘనస్వాగతం పలుకుతుంది.
 

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌