amp pages | Sakshi

ఒక్కరోజులోనే 4,987

Published on Mon, 05/18/2020 - 05:40

న్యూఢిల్లీ: ఎన్నడూ లేనంతగా కేవలం ఒక్క రోజులో 4,987 పాజిటివ్‌ కేసులు.. ఏకంగా 120 మరణాలు. భారతదేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం ఏమాత్రం ఆగడం లేదనడానికి నిదర్శనాలివీ. కరోనా పాజిటివ్‌ కేసులు 90 వేల మార్కును దాటేయడం గుబులు రేపుతోంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు దేశంలో 4,987 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా ప్రభావం మొదలయ్యాక ఒక్కరోజులో ఇన్ని కేసులు బయటపడడం ఇదే మొదటిసారి.

అలాగే గత 24 గంటల్లో 120 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. దీంతో ఇప్పటిదాకా మొత్తం కేసులు 90,927కు, మరణాలు 2,872కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం యాక్టివ్‌కరోనా కేసులు 53,946 కాగా, 34,108 మంది బాధితులు చికిత్సతో కోలుకుని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేటు 37.51 శాతానికి పెరగడం కొంతలో కొంత ఊరట కలిగిస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది.  

మూడు రాష్ట్రాల్లో 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. మహారాష్ట్రలో 30,706, గుజరాత్‌లో 10,988, తమిళనాడులో 10,585 పాజిటివ్‌ కేసులు బహిర్గతం అయ్యాయి. ఇప్పటిదాకా మొత్తం మరణాలు 2,872 కాగా, ఇందులో 1,135 మరణాలు కేవలం మహారాష్ట్రలో సంభవించాయి. గుజరాత్‌లో 625 మంది, మధ్యప్రదేశ్‌లో 243, పశ్చిమ బెంగాల్‌లో 232, ఢిల్లీలో 129, రాజస్తాన్‌లో 126, ఉత్తరప్రదేశ్‌లో 104, తమిళనాడులో 74 మంది కరోనా బారినపడి మృతి చెందారు.  

13.6 రోజుల్లో రెట్టింపు
దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు రెట్టింపయ్యేందుకు ప్రస్తుతం 13.6 రోజుల సమయం పడుతోందని ఆరోగ్యశాఖ తెలి పింది. 14 రోజుల నుంచి 11.5 రోజులుగా ఉన్న ఈ గడువు గత మూడు రోజులుగా 13.6 రోజులకు చేరిందంది. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో మరణాల సంఖ్య  3.1 శాతమని పేర్కొంది. దేశంలో 8 రాష్ట్రాల్లో గత 24 గంటల్లో కరోనా కేసులేవీ నమోదు కాలేదని తెలిపింది. కరోనా కేసులు 106 రోజుల్లో 80 వేల మార్కును దాటాయని, అభివృద్ధి చెందిన యూకే, ఇటలీ, స్పెయిన్, జర్మనీ వంటి దేశాల్లో ఇందుకు 44–66 రోజుల సమయం పట్టిందని పేర్కొంది.

Videos

మా మద్దతు సీఎం జగన్ కే

పవన్ కళ్యాణ్ కు పోతిన మహేష్ బహిరంగ లేఖ

కొల్లు రవీంద్రకు పేర్నినాని సవాల్

భారీగా పట్టుబడ్డ టీడీపీ, జనసేన డబ్బు..!

YSRCPని గెలిపించండి అని సభ సాక్షిగా చంద్రబాబు

గాంధీల కంచుకోటలో టికెట్ ఎవరికి ?

ఏపీ రాజకీయాలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)