amp pages | Sakshi

కాంగ్రెస్‌ ట్వీట్‌.. రాహుల్‌పై జోకులు

Published on Fri, 08/24/2018 - 10:29

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఫొటోలు రాహుల్ గాంధీకి తలనొప్పిగా మారాయి. రాహుల్ గాంధీ వైవిధ్య భరిత హావభావాలు’ అంటూ జర్మనీ పార్లమెంట్‌లో రాహుల్‌ దిగిన నాలుగు ఫోటోలను ట్వీటర్‌లో పోస్ట్‌ చేసింది.  ఇప్పుడా ఫోటోలు సోషల్‌ మీడీయాలో వైరలయ్యాయి. ఆ ఫోటోలపై నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు. కామేడీ కామెంట్లు చేస్తూ ట్రోల్‌ చేస్తున్నారు.

కాంగ్రెస్ చీఫ్ ప్రస్తుతం జర్మనీలో పర్యటిస్తున్నారు. ఆ దేశ పార్లమెంటును రాహుల్ సందర్శించారు. ఈ సందర్భంగా తీసిన కొన్ని ఫొటోలను కాంగ్రెస్ ట్విట్టర్‌లో పోస్టు చేసి వాటికి ‘రాహుల్  వైవిధ్య భరిత హావభావాలు’ అని క్యాప్షన్ తగిలించింది.

రాహుల్ సీరియస్‌గా కిందికి, పైకి, పక్కకి చూస్తూ ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఆ పోటోలు ఉన్నాయి. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. మనసారా నవ్వించినందుకు రాహుల్‌కు థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నానని ఒకరంటే, ప్రపంచంలో ఎక్కడున్నా రాహుల్ నవ్విస్తూనే ఉంటారని మరొకరు కామెంట్ చేశారు. ‘పప్పు స్టేజ్‌ ఎక్కాక ఏం మాట్లాడాలో తెలియడం లేదు’, దేశం గురించి మీ భవిష్యత్ ప్రణాళిక ఏమిటి? అన్న ప్రజల ప్రశ్నకు రాహుల్ రియాక్షన్ ఇదీ.. అంటూ కొందరు కామెంట్ చేయగా, కాంగ్రెస్ పార్టీ తనను తానే ట్రోల్ చేసుకుంటోంది అని మరికొందరు కామెంట్ చేశారు. ‘వైవా పరీక్షల్లో నా పరిస్థితీ ఇదే’ అని మరొకరు పేర్కొన్నారు.  'రాహుల్‌ను తన సొంత సోషల్ మీడియానే దెబ్బతీసేలా ఉంది', ఏం మాట్లాడాలో తెలియక రాహుల్‌ అలా ఫోజు ఇచ్చారని అని మరొకరు కామెంట్‌ చేశారు. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌