amp pages | Sakshi

సీపీఎంలో భగ్గుమన్న విభేదాలు

Published on Mon, 06/20/2016 - 13:25


న్యూఢిల్లీ: మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (సీపీఎం)  లో విభేదాలు  మరోసారి భగ్గుమన్నాయి. పార్టీ మూడు రోజుల కేంద్ర కమిటీ సమావేశాల్లో పార్టీ అగ్రనాయకత్వం  మధ్య తీవ్ర విభేదాలు బయటపడ్డాయి. ప్రధానంగా బెంగాల్ పార్టీ నాయకత్వంపై మాజీలు, అనుభవజ్ఞులైన సీపీఎం నేతలు మండిపడ్డారు.  ఈ నేపథ్యంలో సభ్యుల మధ్య తీవ్ర వాగ్యుద్ధమే నడిచింది.  ఒక దశలో పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి  పరిస్థితి చక్కదిద్దాల్సి వచ్చింది.

ఢిల్లీలో జరుగుతున్న  సీపీఎం పొలిట్ బ్యూరో   శని , ఆదివారం సమావేశాల్లో బెంగాల్  పార్టీ నేత, సూర్జ్యకాంత మిశ్రాపై బెంగాల్ ఓటమికి బాధ్యుడిగా  విమర్శలు గుప్పించారు.  పశ్చిమ బెంగాల్ ఓటమి,  కాంగ్రెస్  తో ఎన్నికల పొత్తు అంశాలపై నేతల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది.  ముఖ్యంగా బెంగాల్ లో ఘోరమైన ఓటిమికి  నేతలు మిశ్రా,  బోస్ బాధ్యత వహించాలంటూ  త్రిపుర, కేరళ, అసోం  ప్రతినిధులు పట్టుబట్టడంతో రగడ మొదలైంది. పార్టీకి తీర్మానానికి వ్యతిరేకంగా  ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్  తో కలిసి పోటీ చేయడంపై  ప్రశ్నించాయి. కాంగ్రెస్ తో  సీట్ల సర్దుబాటును తీవ్రంగా వ్యతిరేకించాయి.  పార్టీ రాష్ట్ర కమిటీకి విరద్ధంగా వ్యవహరించిన బెంగాల్ బ్రిగేడ్ పై మండిపడ్డాయి.  బీజీపీ, కాంగ్రెస్ ఇరుపార్టీలు పార్టీకి సమాన శత్రవులని వాదించాయి.   ఇది కింది కేడర్ లో తప్పుడు సంకేతాలు పంపుతుందని త్రిపుర, కేరళ  సభ్యులు వాదించారు.  

కాంగ్రెస్ తో పొత్తును వ్యతిరేకించిన  వారిలో  మాజీ ప్రధాన కార్యదర్శి  ప్రకాష్ కారత్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్  కూడా ఉన్నారు. బెంగాల్ లో బిమన్ బోస్, మిశ్రా  మూలంగా భారీ మూల్యాన్ని చెల్లుంచుకున్నామని వ్యాఖ్యానించారు.  మిశ్రా, బోస్ వంటి నాయకులు  కాంగ్రెస్తో పొత్తును జస్టిఫై చేయలేని మండిపడ్డారు.  ఎన్నికల్లో గెలవడమే పార్టీ ఏకైక లక్ష్యంగా ఉండకూడదని  స్పష్టం చేశారు.  ఈ పరిణామాల నేపథ్యంలో  పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఆరోపణలపై  సీపీఎం నేత, మహిళా నేత జగమతి సంగ్వాన్ ను    కేంద్ర కమిటీ నుంచి  బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది.  ఒకవైపు విభేదాలు చెలరేగుతుండగా, మరో కీలక నిర్ణయాన్ని సీపీఎం కేంద్ర కమిటీ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.

జగమతి సంగ్వాన్ తొలగింపు

హర్యానా  సీపీఎం నేత,  ఐద్వా ప్రధానకార్యదర్శి జగమతి సంగ్వాన్ బెంగాల్ కమిటీపై మండిపడ్డారు.  పొలిట్ బ్యూరో  బెంగాల్  కమిటీ కి వత్తాసుపలుకుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే  సోమవారం నాటి  కేంద్ర సమావేశాలను బాయ్ కాట్ చేసినట్టు ప్రకటించిన జగమతి మీడియా ముందు  భావోద్వేగానికి లోనయ్యారు.  అయితే జగమతిని  కేంద్ర కమిటీ నుంచి   తొలగించినట్టు ప్రకటించడం విశేషం.

Videos

అవ్వా, తాతల ఉసురు పోసుకుని ఉరేగుతోన్న పచ్చమంద

ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుత..

వైఎస్ భారతి రెడ్డి ఎన్నికల ప్రచారం

ఏపీలో మోదీ ఎన్నికల ప్రచారం

ప్రణాళికా బద్ధంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి..

వైఎస్ఆర్ సీపీ కొత్త కార్యక్రమం 'జగన్ కోసం సిద్ధం'

కూటమికి బిగ్ షాక్

కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసింది: హరీష్ రావు

వల్లభనేని వంశీ తో సాక్షి స్ట్రెయిట్ టాక్

బిగ్ క్వశ్చన్: వాలంటీర్లపై కక్ష..అవ్వాతాతలకు శిక్ష

నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే

మా మద్దతు సీఎం జగన్ కే

పవన్ కళ్యాణ్ కు పోతిన మహేష్ బహిరంగ లేఖ

కొల్లు రవీంద్రకు పేర్నినాని సవాల్

భారీగా పట్టుబడ్డ టీడీపీ, జనసేన డబ్బు..!

YSRCPని గెలిపించండి అని సభ సాక్షిగా చంద్రబాబు

గాంధీల కంచుకోటలో టికెట్ ఎవరికి ?

ఏపీ రాజకీయాలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)