amp pages | Sakshi

రాకెట్‌ దూసుకెళ్లాక ఏం జరిగిందంటే..

Published on Thu, 02/16/2017 - 17:06

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఒకే రాకెట్‌తో 104 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఉపగ్రహాలను రాకెట్‌ కక్ష్యలోకి వదిలడాన్ని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు పీఎస్‌ఎల్వీ-సీ37 వాహకనౌకకు చిన్నపాటి హై రిజల్యూషన్‌ కెమెరాలు అమర్చారు. వాటి ద్వారా నింగిలోకి బయల్దేరిన సమయం నుంచి ఉపగ్రహాలు కక్ష్యలోకి ప్రవేశించే వరకూ వీడియోను చిత్రీకరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బయటకు విడుదల చేశారు. వీడియోలో ఉపగ్రహాలు ఒక్కొక్కటిగా కక్ష్యలోకి చేరడం.. నింగి నుంచి భూమి సౌందర్యం రికార్డయ్యాయి.