amp pages | Sakshi

నా అకౌంట్‌ను లాక్‌ చేసిన్రు : విజయ్‌ దేవరకొండ

Published on Tue, 02/05/2019 - 12:29

కలలు కనడం సహజం. కానీ వాటిని ఏ కొద్దిమందో నిజం చేస్తుంటారు. కష్టానికి తగ్గ ఫలితం వస్తే ఆ కిక్కే వేరు. టాలీవుడ్‌లో సెన్సేషన్‌ స్టార్‌గా ఎదిగిన విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం అలాంటి మూడ్‌లోనే ఉన్నాడేమో. ఈ యంగ్‌ హీరో ఫోర్బ్స్‌ జాబితాలో టాప్‌ 30లో చోటు సంపాదించిన సంగతి తెలిసిందే.

చిన్న పాత్రలతో ఇండస్ట్రీకి పరిచయమైనా.. సరైన టైమ్‌కోసం.. సరైన సినిమా కోసం ఎదురుచూశాడు విజయ్‌. సినిమాలు తన దగ్గరకు వచ్చినప్పుడు తనకు మాత్రమే సొంతమైన నటనాశైలితో ఆకట్టుకున్నాడు. ఇక స్టేజ్‌ ఎక్కితే.. మాటలతో అందర్నీ మాయ చేసేస్తాడు. పెళ్లి చూపులు, అర్జున్‌ రెడ్డి, గీతగోవిందం, టాక్సీవాలా వరుస హిట్‌లతో దూసుకుపోతున్నాడు. తాజాగా ప్రకటించిన ఫోర్బ్స్‌ జాబితాలో చోటు సంపాదించడంతో.. తన అభిమానులతో ఓ విషయాన్ని పంచుకున్నాడు. ‘నాకు 25 ఏళ్లు ఉన్నప్పుడు.. రూ.500 మినిమమ్‌ బ్యాలెన్స్‌ మెయింటెన్‌ చెయ్యలేదని నా అకౌంట్‌ను లాక్‌ చేసిన్రు. అప్పుడు మా నాన్న.. ముప్పై వచ్చే లోపు బాగా సెటిల్‌ కావాలని, తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, యువకుడిగా ఉన్నప్పుడే.. సక్సెస్‌ను ఎంజాయ్‌ చేయగలవని  అన్నారు. నాలుగేళ్ల తరువాత.. ఫోర్బ్స్‌ సెలబ్రెటీలో స్థానంలో సంపాదించాను’ అంటూ ట్వీట్‌ చేశాడు. విజయ్‌ ప్రస్తుతం డియర్‌కామ్రేడ్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)