వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మంచి దూకుడు మీదున్న త్రిష!
Published on Thu, 01/17/2019 - 21:34
‘96’ సినిమాకు తమిళనాట ఊహించని విజయం దక్కింది. ఈ మూవీలో డీసెంట్ లుక్‌లో కనబడిన త్రిషకు మంచి మార్కులు పడ్డాయి. చాలాకాలంపాటు సరైన హిట్ కోసం ఎదురుచూసిన త్రిషకు సూపర్ హిట్ సినిమా దొరికింది. దీంతో తన హవా మళ్లీ మొదలైంది.
అంతలోపే తలైవా రజనీ కాంత్ ‘పేట’లో కూడా అవకావం లభించింది. ఈ చిత్రం కూడా తమిళనాట మంచి విజయాన్ని సొంతం చేసుకుని వంద కోట్ల క్లబ్‌లోకి దూసుకుపోయింది. ఈ సినిమా కూడా సక్సెస్ కావడంతో త్రిషకు ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయట. ఇప్పటికే ఐదారు సినిమాలతో బిజీగా ఉన్న త్రిషకు.. చాలా కథలు వినిపించారట దర్శక నిర్మాతలు. ఇక ఈ ఏడాది త్రిష డైరీ కూడా ఫుల్ కానుందని సమాచారం. సీనియర్ హీరోయిన్స్ అందరిలోకెల్లా త్రిష మాత్రమే ప్రస్తుతం ఇంత బిజీగా ఉన్నారు.
#
Tags