amp pages | Sakshi

డబుల్‌ సెంచరీ చేస్తారా?

Published on Sat, 08/04/2018 - 01:16

నేను కానీ బ్యాట్‌ పట్టుకుని గ్రౌండ్‌లోకి దిగానంటే బాల్‌ బౌండరీ లైన్‌ దాటాల్సిందే... బౌలర్లకు, ఫీల్డర్స్‌కి ముచ్చెమటలు పట్టాల్సిందే.. కప్పు కొట్టాల్సిందే.. అంటున్నారు తాప్సీ. అదేంటీ.. తాప్సీ నటి కదా? క్రికెట్‌ గురించి మాట్లాడుతున్నారేంటి? సినిమాల నుంచి క్రికెట్‌ వైపు ఏమైనా అడుగులేస్తున్నారా? అనేగా మీ డౌట్‌. భారత మహిళా జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ బయోపిక్‌లో తాప్సీ నటించనున్నారని బాలీవుడ్‌లో వార్తలు షికారు చేస్తున్నాయి. ఆ మధ్య హాకీ ప్లేయర్‌ సందీప్‌ సింగ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘సూర్మ’ చిత్రంలో తాప్సీ హాకీ ప్లేయర్‌గా నటించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు క్రికెటర్‌గా కనిపించనున్నారామె. ఇండియాకి ఎన్నో విజయాలను సాధించి పెట్టిన మిథాలీ తన కెరీర్‌లో వన్డేల్లో 114 నాటౌట్‌గా, టెస్ట్‌ మ్యాచుల్లో 214 అత్యుత్తమ స్కోర్‌ సాధించారు. మరి సినిమాలో తాప్సీ... సెంచరీ కొడతారో? డబుల్‌ సెంచరీ కొడతారో చూడాల్సిందే. క్రికెటర్‌గా నటించడమంటే అంత సులువు కాదు. అందుకు ఎంతో ప్రాక్టీస్‌ ఉండాలి. అందుకే ఈ బ్యూటీ శిక్షణ తీసుకోనున్నారట.  మిథాలీ బయోపిక్‌ను బాలీవుడ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ వయాకామ్‌ 18 నిర్మించనుంది. చిత్రవర్గాలు తాప్సీని సంప్రదించగా నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. ‘‘ఆల్రెడీ ఓ స్పోర్ట్స్‌ బయోపిక్‌లో చేశాను. మరో స్పోర్ట్స్‌ బయోపిక్‌ చేయాలని ఉంది. మిథాలీ పాత్ర చేయడానికి రెడీ’’ అన్నారట తాప్సీ.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌